సరే అంటాడు ప్రకాష్. మరోవైపు ఆలోచనలో ఉన్న అపర్ణ దగ్గరికి వచ్చిన రుద్రాణి అపర్ణ మనసు విరిచేలాగా మాట్లాడుతుంది. నువ్వు రాజ్ గురించి ఎన్ని చెప్పినా నాకు భయం లేదు ఎందుకంటే వాడు నా పెంపకంలో పెరిగాడు అంటుంది అపర్ణ. ఎంతైనా వాడు కూడా సగటు మగవాడే కదావదిన, మొదటిసారి వెళ్లి వచ్చేసరికి భార్యకి సపోర్టుగా మారిపోయాడు ఇక ఇప్పుడు మళ్ళీ వెళ్ళాడు అంటే ఇంకెంత మారిపోతాడో, అయినా ఇంటి దగ్గర వరకు వెళ్లిన అల్లుడిని లోపలికి పిలవకుండా కనకం ఊరుకుంటుందా అంటూ అపర్ణని రెచ్చగొడుతుంది రుద్రాణి.