Kanguva Director Siva: సినిమాటోగ్రాఫర్‌గా తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేసిన శివ, 2011లో కార్తి హీరోగా వచ్చిన సిరుతై సినిమాతో దర్శకుడిగా మారారు. రీమేక్ సినిమా అయినా, కథలో కొన్ని మార్పులు చేసి సూపర్ హిట్ చేశారు. అందుకే ఆయన్ని సిరుతై శివ అని పిలుస్తున్నారు. సిరుతై సినిమా తర్వాత అజిత్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది.