సిల్క్ స్మిత పతనం మొదలైంది ఇక్కడే, నిర్మాతగా మారి కోట్లు పోగొట్టుకున్న వైనం, ప్రొడ్యూస్‌ చేసిన చిత్రాలివే

Published : Jun 11, 2025, 07:36 AM ISTUpdated : Jun 11, 2025, 08:01 AM IST

సిల్క్ స్మిత ఒకప్పుడు స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత నిర్మాతగా మారి దారుణంగా నష్టపోయింది. మరి ఆమె నిర్మించిన చిత్రాలేంటో చూద్దాం.

PREV
16
సిల్క్ స్మిత వ్యాంప్‌ రోల్స్ తో స్టార్‌ ఇమేజ్‌

సిల్క్ స్మిత వ్యాంప్‌ రోల్స్ తో సౌత్‌ సినిమాని శాసించిన నటి. కేవలం ఐటెమ్ సాంగ్స్ కే పరిమితం కాకుండా నటిగానూ, హీరోయిన్ గానూ మెప్పించింది. చాలా సినిమాల్లో ఆమె మెయిన్‌ లీడ్‌గా నటించడం విశేషం. స్టార్‌ హీరోలకు దీటుగా స్టార్‌ ఇమేజ్‌ ని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది సిల్క్ స్మిత.

26
రజనీకాంత్‌, చిరంజీవి కూడా సిల్క్ స్మిత కోసం వెయిటింగ్‌

చిరంజీవి అయినా, రజనీకాంత్‌ అయినా ఆమె డేట్స్ కోసం వెయిట్‌ చేయాల్సిందే. ముందు సిల్క్ స్మితని బుక్‌ చేసుకున్న తర్వాతనే హీరోలను ఫైనల్‌ చేసేవారట దర్శక, నిర్మాతలు, అప్పట్లో ఆమెకి అంతటి డిమాండ్‌ ఉండేది. ఆమె ఉంటే జనం థియేటర్లకి క్యూ కట్టేవారు. అందుకే ఆమెకి అంత డిమాండ్‌. 

అయితే నా అనేవారు లేక, నమ్మిన వాడు మోసం చేయడంతో ఆమె జీవితం తలక్రిందులైంది. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆమె సూసైడ్‌ చేసుకుంది.

36
సిల్క్ స్మిత చేసిన పెద్ద మిస్టేక్‌

 సిల్క్ స్మిత ఆర్థికంగా చితికిపోవడానికి ఓ కారణం ఆమె నిర్మాతగా మారడమే. కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో ఒక్కో పాటకి ఆమె హీరోయిన్లకి ఇచ్చే పారితోషికం తీసుకునేదట. అయితే తన క్రేజ్‌ తగ్గుతున్న సమయంలో ఆమె నిర్మాణంలోకి దిగింది. 

మొదట `వీర విహారం` అనే చిత్రంతో నిర్మాతగా మారింది. ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించింది. ఇందులో శ్రీహరి భార్య డిస్కో శాంతి హీరోయిన్‌  రోల్‌ చేసింది. ఈ మూవీ విడుదల కాలేదు. అనేక కారణాలతో ఆగిపోయింది. ఇది కొంత నష్టమే తెచ్చింది.

46
నిర్మాతగా మారిన నష్టపోయిన సిల్క్ స్మిత

కొంత గ్యాప్‌తో ఏకంగా ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసింది సిల్క్ స్మిత. ఎస్సార్‌ సినీ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభి తొలి ప్రయత్నంగా `ప్రేమించి చూడు` అనే చిత్రాన్ని నిర్మించింది. 

రాజేంద్రప్రసాద్‌, చంద్రమోహన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రలో సిల్క్ స్మిత హీరోయిన్‌. ముందుగా దీనికి `బ్రహ్మ నీ తలరాత తారుమారు` అనే పేరు అనుకున్నారు, కానీ ఈ టైటిల్‌కి అభ్యంతరం వ్యక్తం కావడంతో `ప్రేమించిచూడు` అనే పేరుని ఖరారు చేశారు.

56
మోసం చేసిన సెక్రెటరీ

తాను నటిగా అడపాదడపా సినిమాలు చేస్తుండటం, ప్రొడక్షన్‌ గురించి తెలియకపోవడంతో ఈ మూవీని చూసుకునే బాధ్యతలు తన పర్సనల్‌ సెక్రెటరీకి అప్పగించింది. కానీ అతను  మోసం చేశాడు. సినిమాకి బాగా ఖర్చు పెట్టించాడు, తను చాలా వరకు కాజేశాడు. అంతేకాదు సినిమా కూడా డిజాస్టర్‌ అయ్యింది. దీంతో ఈ మూవీ కోసం చేసిన అప్పులను తన నగలు తాకట్టు పెట్టి తీర్చాల్సి వచ్చింది. ఇది ఆర్థికంగా సిల్క్ స్మితకి పెద్ద దెబ్బ.

66
సంపాదించిందంతా పోగొట్టుకున్న సిల్క్ స్మిత

ఆ తర్వాత `నా పేరు దుర్గ` పేరుతో మరో మూవీని నిర్మించింది. దీనికి త్రిపురనేని మహారథి దర్శకుడు. ఓపెనింగ్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. దీంతో సినిమాకి పెట్టిన డబ్బులంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. 

ఇలా నిర్మాతగా మారి చేసిన ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది. సంపాదించిందంతా పోగొట్టుకుంది. దీనికితోడు ప్రేమించిన వాడు మోసం చేశాడు, నమ్మిన వాడూ మోసం చేశాడు. డబ్బులు పోగొట్టుకుంది. దీంతో ఆడిప్రెషన్‌ తట్టుకోలేక మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుందని అంటుంటారు. ఏది నిజమనేది తెలియదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories