ముంబాయ్ లో గ్రాండ్ గా కియారా -సిద్థార్ధ్ వెడ్డింగ్ రిసెప్షన్... తరలి వచ్చిన బాలీవుడ్ తారాలోకం

Published : Feb 13, 2023, 07:21 AM IST

సీక్రేట్ లవ్ కు పుల్ స్టాప్ పెట్టి.. పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు బాలీవుడ్ జంట సిద్దార్థ్ మల్హోత్రా.. కియారా అద్వాని. అతి తక్కువ మంది అతిథుల మధ్య పెళ్ళి చేసుకున్న ఈ జంట.. ముంబయ్ లో మాత్రం పెళ్ళి విందు ఘనంగా ఏర్పాటు చేశారు.    

PREV
19
ముంబాయ్ లో గ్రాండ్ గా కియారా -సిద్థార్ధ్ వెడ్డింగ్ రిసెప్షన్... తరలి వచ్చిన బాలీవుడ్ తారాలోకం

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా – కియారా అద్వాని. చాలా కాలంగా ప్రేమలో మునిగితేలారు. కాని  తమ మధ్య ఏం లేదంటూ.. ఎప్పుడూ బుకాయిస్తూ.. వచ్చారు.  పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్ గా పెళ్ళి చేసుకున్నారు ఈజంట. ఫిల్మ్ ఇండస్ట్రీ ఆశీర్వాదాలకోసం ముంబయ్ లో పెళ్లి విందు ఏర్పాటు చేశారు. 

29

తమ పెళ్లి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా హిస్టారికల్ ప్లేస్ లో తమ వెడ్డింగ్ ను జరుపుకున్నారు జంట.  ఈ నెల 7న  రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 

39

పెళ్లి తరువాత అత్తగారింటో అడుగుకూడా పెట్టింది కియారా. కొత్త పెళ్లి కూతురుకి ఘనంగా స్వాగతం పలికారు సిద్ధార్థ్ ఫ్యామిలీ.గానా భజానాలతో డాన్స్ లతో ఇంట్లోకి ఆహ్వానించారు టీమ్. ఇక అదే రోజు రాత్రి. బాంధువుల మధ్య రిసెప్షన్ వేడుక కూడా జరిగిపోయినట్టు తెలుస్తోంది. 

49

ఈక్రమంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీవారి కోసం గ్రాండ్ గా రిసెప్షన్ ను  ఏర్పాటు చేశారు కియారా - సిద్ధార్థ్.  ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్  సినీ తారలోకం తరలి వచ్చింది.  ఈ రిసెప్షన్ కోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు బాలీవుడ్ జంట. అంతే గ్రాండ్ గా వేడుకను నిర్వహించారు కూడా. 
 

59

ముంబైలోని ఓ స్టార్ హోటల్‌ లో  నిన్న(12 పిబ్రవరి)  రిసెప్షన్ వేడుకజరిగింది.  రిసెప్షన్‌ ఏర్పాట్లు స్వయంగా కొత్త జంట పర్వావేక్షించారు. దీని కోసం కియారా, సిద్దార్ధ్ ముందు రోజే అంటే  శనివారం ఢిల్లీ నుంచి ముంబై వచ్చినట్టు తెలుస్తోంది. 
 

69

ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు బాలీవుడ్‌ సెలబ్రిటీలు, పలువురు పారిశ్రామివేత్తలు హాజరయ్యారు.  ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట ప్రస్తుతం  వైరల్ అవుతున్నాయి. ఈ రిసెప్షన్ లో ముఖ్యంగా అజయ్ దేవగణ్, కాజోల్ స్పెషల్ గా నిలిచారు. 

79

కియారా అద్వాని, సిద్దార్ధ్ ల రిసెప్షన్ వేడుకలో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో పాటు.. కరీనాకపూర్ కూడా స్పెషల్ గా  కనిపించారు. వీరితో పాటు మరికొంత మంది తారలు తళుక్కున మెరిసారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 
 

89

ఈ రిసెప్షన్ లో టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా ప్రత్యేకంగా కనిపించింది. రెడ్ శారీలో అందాలు ఆరబోస్తూ.. స్పెషల్ అనిపించకుంది. 
 

99

షేర్షా సినిమాతో ఆన్‌స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్‌, కియారా కొంతకాలానికి ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు.. సౌత్ లో కూడా స్టార్ గా రాణిస్తున్న కియారా అద్వాని తెలుగులో భరత్‌ అనే నేను, వినయ విధేయ రామా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ జోడీగా శంకర్ సినిమాలో నటిస్తోంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories