సిల్క్ చీరలో శృతి హాసన్‌ టెంప్టింగ్‌ పోజులు.. ట్రెడిషనల్‌ లుక్‌లో ఇంత హాట్‌గానా? ఇన్నాళ్లు మిస్‌ అయ్యారే!

Published : Mar 09, 2023, 06:01 PM ISTUpdated : Mar 09, 2023, 06:29 PM IST

శృతి హాసన్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉంది. ఈ బ్యూటీ భారీ చిత్రాలతో అలరించింది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లని అలరిస్తుంది. అందాల విందు చేస్తుంది.

PREV
18
సిల్క్ చీరలో శృతి హాసన్‌ టెంప్టింగ్‌ పోజులు.. ట్రెడిషనల్‌ లుక్‌లో ఇంత  హాట్‌గానా? ఇన్నాళ్లు మిస్‌ అయ్యారే!

శృతి హాసన్‌ స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ తనయ అయినప్పటికీ ఎప్పుడూ ఆయన ఇమేజ్‌ని వాడుకోవాలని చూడలేదు. స్వతంత్రంగానే ఉండేందుకు ప్రయత్నించింది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్స్ లాగే తాను రాణిస్తూ వస్తోంది. అదే సమయంలో అందాలను ఆరబోయడంలోనూ ఇంకా వాళ్లని మించిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

28

హాట్‌ హాట్‌ ఫోటో షూట్లు, కొంటెగా దిగిన సెల్ఫీ పిక్స్ ని, బాయ్‌ ఫ్రెండ్‌తోటి ఫోటోలను పంచుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది శృతి. తాజాగా ఈ అమ్మడు శారీలో మెరిసింది. చాలా వరకు ట్రెండీ వేర్స్ లో, మరీ పొట్టివైన దుస్తులు ధరించి ఆకర్షించే ఈ అందాల భామ ఇప్పుడు చీరలో మైమరపిస్తుంది. నెవర్‌ బిఫోర్‌ అనేలా ఇందులో కనిపించడం విశేషం. 
 

38

శృతి హాసన్‌ లేటెస్ట్ గా సిల్క్ చీరలో మెరిసింది. ఎర్రని కొంగు కలిగిన ఆకుపచ్చని కలర్‌ చీరలో హోయలు పోయింది. కవ్వించే చూపులతో కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుంది. ఘాటు రేపే అందాలతో మైమరపింప చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. 
 

48

స్టార్‌ కిడ్‌, స్టార్‌ హీరోయిన్‌ శృతి ఇటీవల తెలుగులో వరుసగా విజయాలు అందుకుంది. సంక్రాంతి అంతా తనదే అన్నట్టుగా ఓ వైపు మెగాస్టార్‌ `వాల్తేర్‌ వీరయ్య`తో, మరోవైపు నందమూరి నటసింహాం బాలయ్య `వీరిసింహారెడ్డి`తో సక్సెస్‌లు అందుకుంది. సక్సెస్‌ జోరులో ఉంది. అంతేకాదు వరుస విజయాలతో గోల్డెన్‌ లెగ్‌గా రాణిస్తుంది. 
 

58

శృతి హాసన్‌ నటించిన తెలుగు సినిమాలన్నీ విజయాలు సాధించడం విశేషం. కెరీర్‌ బిగినింగ్‌లో చేసిన `అనగనగా ఓ ధీరుడు`, `ఓ మై ఫ్రెండ్‌`, ఎన్టీఆర్‌ `రామయ్య వస్తావయ్య` చిత్రాలు పక్కన పెడితే, `గబ్బర్ సింగ్‌`, `బలుపు`, `ఎవడు`, `రేసుగుర్రం`, `శ్రీమంతుడు`, `ప్రేమమ్‌`చిత్రాలతో సక్సెస్‌లు అందుకుంది. 
 

68

మధ్యలో పవన్‌ కళ్యాణ్‌ `కాటమరాయుడు` బోల్తా కొట్టింది. కొంత గ్యాప్‌ తర్వాత చేసిన `క్రాక్‌`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. పవన్‌తోనే మళ్లీ `వకీల్‌సాబ్‌`లో నటించి హిట్‌ అందుకుంది. ఇటీవల `వాల్తేర్‌ వీరయ్య`, `వీరిసింహారెడ్డి`లతో హిట్‌ కొట్టి జోరుమీదుంది.

78

 ప్రస్తుతం ఈ బ్యూటీ `సలార్‌`లో ప్రభాస్‌తో నటిస్తుంది. ఆద్య పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె పాత్ర షూటింగ్‌ పూర్తి చేసుకుంది. దీంతోపాటు `ది ఐ` అనే ఇంగ్లీష్‌ సినిమా చేస్తుంది. కొత్తగా తెలుగు, తమిళం చిత్రాలను గానీ ప్రకటించలేదు. అయితే చర్చల దశలో ఉన్నట్టు టాక్.

88

మరోవైపు డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ప్రేమలో మునిగి తేలుతుంది శృతి. ఆయనతో కలిసి ముంబయిలో సహజీవనం చేస్తుంది. ఇద్దరూ ఘాటుగా ప్రేమించుకుంటున్నారు. మరి పెళ్లి వరకు వెళ్తారా? లేదా అనేది చూడాలి. కానీ తరచూ బాయ్‌ ఫ్రెండ్‌తో కూడిన ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ తన ప్రేమని తెలియజేస్తుంది శృతి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories