పట్టుచీరలో మెరిసిపోతున్న బాలయ్య భామ.. ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్!

First Published | Mar 9, 2023, 5:33 PM IST

యంగ్ బ్యూటీ  ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) తాజాగా విజయవాడలో సందడి  చేసింది. ఓ నగల షోరూమ్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఈ సందర్భంగా పట్టుచీరలో హాజరై అందరినీ కట్టిపడేసింది.
 

నందమూరి బాలయ్య సరసన ‘అఖండ’లో నటించిన ప్రగ్యా జైశ్వాల్  బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఈ చిత్రంతో ప్రగ్యాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం అదే జోష్ ను కంటిన్యూ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ మెరుస్తోంది.  
 

సినిమాల  పరంగా కాస్తా వెనకబడి ఉన్న ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో మాత్రం ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ జ్యూయెల్లరీ మాల్ ఓపెనింగ్ కు హాజరైందీ ముద్దుగుమ్మ.
 


విజయవాడలోని ‘వేగ’ జ్యూయెలరీస్ ప్రారంభోత్సవంలో నందమూరి బాలయ్యతో కలిసి ప్రగ్యా హాజరయ్యారు. ఇప్పటికే బాలయ్య, ప్రగ్యా జంటగా ఈ షోరూమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. యాడ్ షూట్ తోనూ ఆకట్టుకున్నారు. 
 

ఇక తాజాగా షోరూమ్ ప్రారంభోత్సవం బాలయ్య, ప్రగ్యా సందడి చేశారు. తమ ఫ్యాన్స్ కు కనిపించి ఖుషీ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపించే ప్రగ్యా జైశ్వాల్ తాజాగా ఈ ఫొటోలను పంచుకుంది. ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేసింది.

తాజాగా  ప్రగ్యా  పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పట్టుచీరలో మెరిసిపోతూ ఫొటోలకు పోజులిచ్చింది. కాస్ల్టీ జ్యూయెల్లరీ, పట్టుచీర ధరించి మరింతగా మెరిసిపోతోంది. మరోవైపు స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ప్రగ్యా టాప్ గ్లామర్ షోతో మైమరిపించేసింది.
 

సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతున్న ప్రగ్యా జైశ్వాల్ ఫొటోషూట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అభిమానులు కూడా ఆమెను ట్రెడిషనల్ లుక్ లోనేచూసేందుకు ఇష్టపడుతుంటారు. పట్టుచీరలో నిండుగా దర్శనమివ్వడంతో లైక్స్, కామెంట్లతో నెట్టింట పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!