లీకైన శృతి హాసన్ సలార్ రెమ్యూనరేషన్... ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాకవుతారు!

ప్రభాస్ ఇమేజ్ రీత్యా ఆయన కొత్త సినిమా ప్రకటిస్తే ప్రభంజనమే.  పాన్ ఇండియా స్టార్ గా వందల కోట్ల బడ్జెట్ తో ఆయన వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు . ప్రభాస్ ప్రకటించిన చిత్రాలలో అందరి ద్రుష్టి సలార్ పైన ఉంది. దీనికి కారణం ఆ సినిమా కాంబినేషన్ అని చెప్పాలి.

ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు మాస్ హీరోగా భారీ కటవుట్ కలిగిన ప్రభాస్ హీరోయిజం, ఏ రేంజ్ లో ఎలివేట్ చేయనున్నాడో అనే అతృత అందరిలో పెరిగిపోయింది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకున్న సంగతి తెలిసిందే.
సలార్ మూవీలో హీరోయిన్ గా పలువురు బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా కత్రినా ఖైఫ్ పేరు ప్రచారం జరిగింది. అలాగే మరో బాలీవుడ్ భామ దిశా పటాని నటిస్తున్నారంటూ కూడా వార్తలు రావడం జరిగింది.

ఎవరూ ఊహించని విధంగా చిత్ర యూనిట్ శృతి హాసన్ ని సలార్ హీరోయిన్ గా ప్రకటించారు. శృతి బర్త్ డే నాడు సలార్ చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో ఫార్మ్ లో లేని శృతి హాసన్ ని తీసుకోవడం ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేసింది. ప్రభాస్ మూవీ అంటే ఎగిరి గంతేసి ఒప్పుకునే అనేక మంది టాప్ హీరోయిన్స్ ఉండగా... శృతిని ఎందుకు ఎంచుకున్నారో ఎవరికీ అంతుబట్టలేదు.
ఏది ఏమైనా శృతి హాసన్ సలార్ లో హీరోయిన్ గా ఎంపిక కాగా ఆమె రెమ్యూనరేషన్ పై ఆసక్తికర వార్త ప్రచారం అవుతుంది. సలార్ కోసం శృతి హాసన్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే కొంచెం ఆశ్చర్యాన్ని గురికావడం ఖాయం.
సలార్ నిర్మాతలు శృతి హాసన్ కి కేవలం కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.  సలార్  లాంటి పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా ఎంపికై కూడా కోటి రూపాయలతో సరిపెట్టుకోవడం అంటే చాల కాంప్రమైజ్ అయినట్లే.
స్టార్ హీరోయిన్స్ నుండి ఫేడవుట్ దశకు చేరుకున్న కాజల్, తమన్నా... ఇప్పటికి కూడా రెండు నుండి కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాంటిది శృతి కేవలం ఇంత తక్కువ తీసుకోవడం ఆలోచించాల్సిన విషయమే.
బహుశా సలార్ లో శృతి పాత్రకు నిడివి తక్కువ కావడం వలన, తక్కువ రోజులు డేట్స్ ఇచ్చిన కారణంగా కూడా ఇంత తక్కువ రెమ్యూనరేషన్ కి ఒప్పుకొని కూడా ఉండవచ్చు.
ఇక సలార్ షూటింగ్ తెలంగాణా రాష్ట్రంలో మొదలైంది.గోదావరి ఖనిలో  ఓ ఫైట్ సన్నివేశం చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటున్నారు. పదిరోజుల పాటు ఓ భారీ యాక్షన్ సన్నివేశం అక్కడ చిత్రీకరించనున్నారని సమాచారం.
నిన్న రామగుండం విద్యుత్ ప్లాంట్, సింగరేణి బొగ్గుగనులను ప్రభాస్ సందర్శించారు.  సలార్ కథలోని కొన్ని కీలక సన్నివేశాలు ఆ ప్రాంతాలతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తుంది.
ప్రభాస్ రాకను తెలుసుకున్న అభిమానాలు వేల సంఖ్యలో గోదావరి ఖని చేరుకున్నారు. ఇక ప్రభాస్ లుక్ కి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది.

Latest Videos

click me!