రకుల్‌ హాట్‌ యోగాపోజులు.. సెక్సీ వర్కౌట్.. వైరల్‌ అవుతున్న వీడియో..

First Published | Jan 30, 2021, 1:18 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందానికి, అద్భుతమైన ఫిట్‌నెస్‌ కి కారణం ఆమె చేసే యోగా, జిమ్‌లో ఎక్కువ సేపు గడపడమే అని రకుల్‌ చెబుతుంది. తాజాగా హాట్‌ యోగా ఫోటోని, సెక్సీ వర్కౌట్‌ వీడియోని పంచుకుంది రకుల్‌. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

రకుల్‌ యోగాకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ సెక్సీ భామ ఎప్పుడెప్పుడు యోగా చేస్తుందని చూసే వాళ్లు చాలా మందే ఉన్నారు.
అయితే వారిలో కొందరు రకుల్‌ యోగాని ఫాలో అవ్వడానికి చూస్తే, మరికొందరు ఆమెలోని హాట్‌ యాంగిల్స్ కోసం ఫాలో అయ్యేవాళ్లున్నారు.

తాజాగా ఓ కొత్త యోగా ఫోటోని పంచుకుంది రకుల్. ఇందులో ఓ కాలుపై నిలబడి, ఒక కాలు, రెండు చేతులు సమాంతరంగా పెట్టిన ఫోటోని పంచుకుంది.
ఈ సందర్భంగా రకుల్‌ చెబుతూ, `బ్యాలెన్స్ అనేది మీరు కనుగొన్నది కాదు. ఇది మీరు క్రియేట్‌ చేసింది. నా బ్యాలెన్స్ ని చూస్తున్న మీకు ధన్యవాదాలు` అని పేర్కొంది. ఇందులో అన్షుకా యోగా సెంటర్‌లో ఇలా హాట్‌ ఆసనాలతో ఆకట్టుకుంటుంది రకుల్.
అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కరోనా బారిన పడి కోలుకుంది. దీంతో ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో పాటు మరింత ఫిట్‌నెస్‌ సాధించేందుకు కృషి చేస్తున్నట్టు కనిపిస్తోంది. యోగాలో అతికష్టమైన ఆసనంతో కొత్త యోగిని భామగా అవతరించారు. ఈ మేరకు ఆమె ఒక క్లిష్టమైన ఆసన​ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.
రకుల్‌ ఫిట్‌నెస్‌ సెంటర్లని నడిపిస్తున్న విషయం తెలిసిందే. అందులో నిత్యం యోగా చేస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. వాటిని ప్రమోట్‌ చేసుకుంటుంది.
మరోవైపు `ఫ్రైడేఫీల్స్` పేరుతో రెండు ఫోటోలను జాయింట్‌ చేసి పంచుకుంది రకుల్. ఇందులో ఎక్స్ పెక్టేషన్‌, రియాలిటీ అని పేర్కొంది. ఆమె లెక్క ప్రకారం అంచనాలో ఏంజెల్‌లాగా ఉంటాయని, వాస్తవాలు వేరేగా ఉంటాయనే అర్థం వచ్చేలా చేసినట్టు తెలుస్తుంది.
సూర్య కిరణాలు తన తలపై నుంచి పడుతుండగా, పచ్చని చెట్ల మధ్య కూర్చొని దిగిన ఫోటోని పంచుకుంటూ తమ డ్రీమ్స్ ని ఫాలో కావాలని తెలిపింది రకుల్.
తెరచాటుగా కవ్విస్తూ మత్తెక్కించే చూపులతో ఉన్న మరో ఫోటోని పంచుకుంటూ `పాతకాలపు హృదయంతో యంగ్‌ ఐస్‌, వింటేజ్‌ హార్ట్` అంటూ కొత్త షూట్‌ సిరీస్‌ కమ్మింగ్‌ సూన్‌ అని పేర్కొంది రకుల్‌.
రకుల్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తెలుగులో ఈ అమ్మడు `చెక్‌` చిత్రంలో నటిస్తుంది.
దీంతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో డీ గ్లామర్‌ లుక్‌లో మెరవనుంది.
అలాగే పవన్‌ కళ్యాణ్‌తోనూ రొమాన్స్ చేయబోతుంది. `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రంలో పవన్‌ సరసన హీరోయిన్‌గా రకుల్‌ పేరు వినిపిస్తుంది.
దీంతోపాటు హిందీలో వరుసగా సినిమాలు చేస్తుంది రకుల్‌. `అయలాన్‌`, `ఎటాక్‌`, `సర్దార్‌ అండ్‌ గ్రాండ్‌సన్‌`, `థ్యాంక్‌ గాడ్‌`, `మేడే` సినిమాలు చేస్తుంది.
తమిళం `ఇండియన్‌ 2`లో నటిస్తుంది. ప్రస్తుతం రకుల్‌ చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి.

Latest Videos

click me!