శ్రియ నుంచి సమంత, సాయి పల్లవి వరకు.. టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఏం చదివారో తెలుసా!

First Published | Aug 31, 2020, 5:26 PM IST

ఒకప్పుడు ఫిలిం స్టార్స్‌ అంటే పెద్దగా చదువు సంధ్య లేని వారు అన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవారంతా ఉన్నత చదువులు చదివిన తరువాతే వెండితెర మీద అడుగుపెడుతున్నారు. వెండితెర మీద గ్లామర్ ఒలకబోసే హీరోయిన్లు కూడా పెద్ద చదువుల తరువాతే సిల్వర్‌ స్క్రీన్‌ అరగేంట్రం చేస్తున్నారు.

టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు వెండితెర మీద అందాలు ఆరబోయటమే కాదు, కాలేజ్‌లలోనూ మంచి మార్కులు సాధించి బెస్ట్ స్టూడెంట్స్‌ అనిపించుకున్నారు.
సౌత్‌లో నెంబర్ వన్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నయనతార ఉన్నత చదువుల తరువాతే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ మార్తోమా కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అందాల భామ అనుష్క. యోగా టీచర్‌గా పనిచేసిన ఈ బ్యూటీ కార్మెల్‌ కాలేజీలో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
సౌత్ టాప్‌ హీరోయిన్ సమంత ప్రస్తుతం విభిన్న పాత్రలతో దూసుకుపోతోంది. ఈ బ్యూటీ చెన్నై స్టెల్లా మేరీ కాలేజ్‌లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
మిల్కీ బ్యూటీ తమన్నా ఫీల్డ్ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అంతేకాదు తన కాలేజ్‌ డేస్‌లోనే పలు షోస్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం పలు భాషల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.
సీనియర్ హీరోయిన్ త్రిష సినిమాల్లోకి రాకముందు క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలనుకున్నారు. కానీ ఆమె చెన్నైలోని ఎథిరాజ్‌ కాలేజ్‌ నుంచి బీబీఏ డిగ్రీ పూర్తి చేశారు.
అందాల చందమామ కాజల్‌ అగర్వాల్ గ్లామర్‌ ఫీల్డ్‌కు సంబంధించిన చదువే చదివింది. అయితే ఆమె ఎంబీఏ చేయాలని భావించినా సినిమాల్లో బిజీ కావటంతో చదవలేకపోయింది.
హాట్ బ్యూటీ రకుల్‌ ప్రీత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో మాథ్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
సీనియర్ హీరోయిన్‌ శ్రియ లేడీ శ్రీరామ్‌ కాలేజీలో డిగ్రీ చేసింది. ఆమె ఇంగ్లీష్ లిటరేచర్‌లో బీఏ చేసింది.
నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి డాక్టర్‌ అయ్యాకే యాక్టర్ అయ్యింది. ఈ బ్యూటీ టిబిలిసి స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ పట్టా పొందింది.

Latest Videos

click me!