శ్రద్ధా ఖాకీ డ్రెస్‌లో కేక పుట్టిస్తుంది!

First Published | Aug 31, 2020, 9:18 PM IST

గ్లామర్‌ షో చేసినా సరైనా గుర్తింపు రాలేదు శ్రద్ధా దాస్‌కి. చిన్నా.. చితకా చిత్రాలు, పాత్రలు తప్ప పెద్ద సినిమాలు ఆమెని వరించలేదు. దీంతో బీ గ్రేడ్‌ హీరోయిన్‌గానే మిగిలిపోయింది. తాజాగా పోలీసు డ్రెస్సులో కనువిందు చేసింది. 

నిత్యం నటిగా నిరూపించుకునేందుకు తపిస్తున్న శ్రద్ధా దాస్‌ తాజాగా పోలీస్‌ డ్రెస్సులో అదరగొడుతుంది. ఇంకా చెప్పాలంటే కాక పుట్టిస్తుంది. గ్లామర్‌తో మంత్రముగ్ధుల్ని చేసినఈ అమ్మడు ఇప్పుడు పోలీస్‌గా మారడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.
సినిమా ఛాన్స్ లు పెద్దగా లేని శ్రద్ధా దాస్‌ వెబ్‌ సిరీస్‌కే పరిమితమవుతుంది. తాజాగా ఆమె ఓ హిందీ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. కరోనా టైమ్‌లో మొదటిసారి షూటింగ్‌లోపాల్గొనబోతున్నానని శ్రద్ధా తెలిపింది. అంతటితో ఆగలేదు. ఖాకీ డ్రస్సులో ఉన్న కొన్ని ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

`పూణేలో ఓ హిందీ వెబ్‌ సిరీస్‌ కోసం ఈ మహమ్మారి విజృంభన టైమ్‌లో మొదటిరోజు షూట్‌లో పాల్గొన్నాను. మొదటిసారి ఇండియన్‌ పోలీస్ యూనిఫామ్‌ ధరించాను. చాలా సంతోషంగా ఉంది` అని శ్రద్ధా దాస్ ట్విట్టర్‌లో పేర్కొంది. చాలా వరకు తాను నటించిన సినిమాల్లో గ్లామర్‌ షోతో కనిపిస్తూ తన నడుమందాలను, టాప్‌ టూ బాటమ్‌ అందాల షోచేసే శ్రద్ధా దాస్‌ ఇలా స్టయిలీష్‌ పోలీస్‌గా కనిపించడం ఆకట్టుకుంటోంది.
2008లో `సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకులం` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ ముంబయికి చెందిన సెక్సీ భామ.. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది.
`అధినేత`, `ఆర్య 2`, `మరో చరిత్ర`, `డార్లింగ్‌`, `నాగవళ్లి`, `రేయ్‌`, `బందిపోటు`, `ఆట`, `గరుడవేగ` చిత్రాల్లో నటించింది. అయినా ఈ అమ్మడికి హీరోయిన్‌గా రావాల్సినంతగుర్తింపు రాలేదు.
తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, బెంగాలి, ఇంగ్లీష్‌ చిత్రాల్లో నటిస్తూ రాణిస్తున్నారు. మొత్తంగా నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకోవడంలో స్ట్రగుల్‌అవుతుంది. అందమే కాదు, నటన కూడా ముఖ్యమని తెలుసుకుంటోంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం తెలుగులో `నిరీక్షణ`, కన్నడలో `కోటిగొబ్బ 3`చిత్రాల్లో నటిస్తుంది. మరి ఈ సినిమాలైనా శ్రద్ధాకి మంచి పేరుని తెస్తాయేమో చూడాలి. కానీ ఆమె అందాల ఫోటోలుమాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే ఉన్నాయి.

Latest Videos

click me!