చిరంజీవి కూడా మంగళవారం రియాక్ట్ అయ్యారు. త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, ఇలాంటి అభ్యంతరకరమైన, అసహ్యమైన కామెంట్లని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించవద్దని, తాను తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇది ఆ ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు, మహిళలందరికి కించపరిచినట్టే అవుతుందని, చెబుతూ, తాను త్రిష వైపు నిలబడ్డానని తెలిపారు చిరు. ఈ మేరకు ఆయన `ఎక్స్` ద్వారా పోస్ట్ చేశారు.