పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య గురించి షాకింగ్‌ నిజాలు.. పేరు మార్పు.. రాయల్‌ లైఫ్‌?

Published : May 17, 2023, 02:41 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మొదటి (మాజీ) భార్య నందిని గురించి కొన్ని ఆసక్తికర, షాకిచ్చే నిజాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. 

PREV
16
పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య గురించి షాకింగ్‌ నిజాలు.. పేరు మార్పు.. రాయల్‌ లైఫ్‌?

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రాణిస్తున్న కెరీర్‌ ప్రారంభంలోనే నందిని అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. 1997లో వీరి వివాహం జరిగింది.దాదాపు పదేళ్లపాటు ఈ ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చోటు చేసుకున్న మనస్పర్థాల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో సుమారు ఐదు కోట్ల వరకు ఆమెకి విడాకుల భరణంగా పవన్‌ ఇచ్చారని సమాచారం. ఆ తర్వాత నందిని ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌కే పరిమితమయ్యింది. 

26

వైజాగ్‌కి చెందిన నందిని ఆమె మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంది. డాక్టర్‌ కృష్ణరెడ్డిని ఆమె వివాహం చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఆయన అమెరికాలో సెటిల్‌ అయిన ఇండియన్‌. అక్కడ మంచి వ్యాపారాలున్నాయట. అయితే పవన్‌ తో విడాకుల తర్వాత ఆమె తన పేరు కూడా మార్చుకుందట. జాన్వీగా పేరు మార్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరు అమెరికాలో ఉంటుందన్నారని, చాలా రాయల్‌ లైఫ్‌ అనుభవిస్తున్నట్టు తెలుస్తుంది. 
 

36

నందిని(జాన్వీ) భర్త అక్కడ రిచ్‌ పర్సన్‌ అని, వందల కోట్ల ఆస్తులున్నట్టు సమాచారం. వారి ఆస్తుల విలువ సుమారు మూడు వందల కోట్ల వరకు ఉంటాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతుంది. తన గతాన్ని మర్చిపోయి ప్రస్తుతం తన ఫ్యామిలీతో హాయిగా ఉందట. ఆమె పూర్తిగా ప్రైవేట్‌ లైఫ్‌ని లీడ్‌ చేయడానికే ఇష్టపడుతుందని, సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఆమెకి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు ఎక్కడా బయటకు రాలేదు. బట్‌ యూఎస్‌లో లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నట్టు టాక్‌. 
 

46

ఇక పవన్‌ నందినికి విడాకుల అనంతరం రేణు దేశాయ్‌ని ప్రేమించి అకిరా నందన్‌ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. 2009లో వీరి పెళ్లి జరగ్గా ఆ తర్వాత ఆద్య జన్మించింది. 2012లో రేణు దేశాయ్‌కి కూడా పవన్‌ విడాకులిచ్చాడు. అందుకు భారీగానే భరణం చెల్లించినట్టు పవన్‌ చెబుతుంటాడు. తన ఆస్తిలో పెద్ద వాటనే ఆమెకి ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పటికే తన పిల్లలు అకీరా, ఆద్యలకు పవన్‌ టచ్‌లోనే ఉంటారు. వారి బాగోగులు ఆయన చూసుకుంటున్నారట. 

56

`తీన్‌ మార్‌` సినిమా సమయంలో రష్యాకి అన్నా లెజినోవాతో పవన్‌కి పరిచయం ఏర్పడింది. 2013లో ఆమెని వివాహం చేసుకున్నారు పవన్‌. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం తనమూడో భార్యతో ఉంటున్నారు పవన్‌. అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. జనసేన పార్టీని ఆయన స్థాపించి రాజకీయాల్లో బిజీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లోపోటీకి రెడీ అవుతున్నారు. ఆ ఎలక్షన్లలోపూ ఒప్పుకున్న నాలుగు సినిమాలను ఫినీష్‌ చేయాలనుకుంటున్నారు.

66
Pawan Kalyan

ప్రస్తుతం పవన్‌ `హరి హర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `వినోదయ సీతం` చిత్రాల్లో నటిస్తున్నారు. జులై 28న `వినోదయ సీతం` రీమేక్‌ విడుదల కాబోతుంది. రేపు ఈ చిత్ర టైటిల్‌,ఫస్ట్ లుక్‌ రానుంది. మరోవైపు `హరి హర వీరమల్లు` చాలా ఆలస్యమవుతుంది. ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియాల్సి ఉంది. ఇది పక్కన పెడితే వచ్చే ఎన్నికల లోపు మూడుసినిమాలో అరించబోతన్నారని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories