బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా జైలు శిక్ష అనుభవించిన రేపిస్ట్? అదే జరిగితే షో మటాషే..!

First Published | Jun 30, 2021, 11:20 AM IST


తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 2017లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా మొదలైన బిగ్ బాస్ షో అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతుంది. భారీ టీఆర్పీ దక్కించుకుంటున్న ఈ షో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదవ సీజన్ కి సిద్ధం అవుతుంది. 

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5 మొదలుకావాల్సి ఉంది. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం అయ్యింది. కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టగా, వీలైనంత త్వరగా షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్వాహకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ సీజన్ 5 ప్రసారం కానుందన్న వార్త గట్టిగా వినిపిస్తుంది. దీని కోసం నిర్వాహకులు కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారట. ఇక బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో పాల్గొనే సెలెబ్రిటీలు వీరే అంటూ కొందరి పేర్లు బయటకు రావడం జరిగింది.

యూట్యూబర్ షణ్ముఖ్, యాంకర్ రవి, సురేఖ వాణి, యాంకర్ శివ, యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ... ఇలా పలువురి పేర్లు ప్రచారం అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.
తాజాగా ఓ కాంట్రవర్షియల్ నేమ్ తెరపైకి వచ్చింది. టిక్ టిక్ ద్వారా ఫేమ్ రాబట్టి ఫన్ బకెట్ వంటి కామెడీ ప్రోగ్రామ్ లో కనిపించిన భార్గవ్, బిగ్ బాస్ 5 కొరకు ఎంపికయ్యారని వార్తలు వస్తున్నాయి. నిర్వాహకులు అతన్ని సంప్రదించారని అతడు పాల్గొనే అవకాశం కలదని అంటున్నారు.
నిజంగా అదే జరిగితే సంచలనమే అని చెప్పాలి. భార్గవ్ ఇటీవల ఓ మైనర్ బాలికను రేప్ చేసి, గర్భవతిని చేశాడన్న ఆరోపణలపై జైలుపాలయ్యాడు. విశాఖకు చెందిన ఓ బాలికను ఫేమస్ చేస్తానని వశపరుచుకొని గర్భవతిని చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
జైలు జీవితం గడుపుతున్న భార్గవ్ బిగ్ బాస్ షోలోకి వస్తున్నాడన్న వార్త సంచలనంగా మారింది. సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న భార్గవ్ లాంటి వ్యక్తిని షోలోకి తీసుకుంటే, బిగ్ బాస్ షో పై పూర్తి వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం కలదు.
ఇప్పటికే బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కించేపరిచేదిగా ఈ షో ఉందని ఎప్పటి నుండో ఆందోళనలు జరుగుతున్నాయి. మరి భార్గవ్ లాంటి క్రిమినల్స్ కి అవకాశం ఇస్తే షో మటాషే!

Latest Videos

click me!