నీ చీర నాకు కావాలి.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫోజులకు రాజశేఖర్ కూతురు కామెంట్

Published : Mar 31, 2024, 12:56 PM IST

వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే.

PREV
17
నీ చీర నాకు కావాలి.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫోజులకు రాజశేఖర్ కూతురు కామెంట్

వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే. అందం,అభినయం ఉన్నప్పటికీ టాలీవుడ్ దదర్శకులు ఆమెని పట్టించుకోవడం లేదు.  

27

గతంలో ఈషా మీడియం రేంజ్ చిత్రాలు చేసింది. ఇప్పుడు దయ లాంటి వెబ్ సిరీస్ తో హిట్ కొట్టింది. కానీ ఆమె గ్లామర్ కి తగ్గ ఆఫర్స్ అందుకోవడం లో మాత్రం వెనుకబడే ఉంది. 

37

సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

47

సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం మెప్పించగలదు. ఈషా షేర్ చేసే పిక్స్ చాలా క్యూట్ గా ఉంటాయి.  

57

తాజాగా ఈషా రెబ్బా పింక్ కలర్ బ్యూటిఫుల్ శారీలో మెరిసింది. ఊహలలో విహరిస్తున్నట్లు ఈషా కూర్చుని ఇస్తున్న ఫోజులు చూడ ముచ్చటగా ఉన్నాయి. 

67

ఈషా రెబ్బా ఫోజులకు హీరోయిన్లు సైతం ఫిదా అవుతున్నారు. ప్రియాంక జవాల్కర్ నైస్ శారీ అని కామెంట్ పెట్టింది. ఇక రాజశేఖర్ కుమార్తె శివాని.. లుకింగ్ లైక్ ఏ వావ్.. నైస్ శారీ.. అది నాకు కావాలి అని కామెంట్ పెట్టింది. 

77

దీనితో ఈషా రెబ్బా రిప్లై ఇచ్చింది. సరే తీస్కో అని శివానికి రిప్లై ఇచ్చింది. బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ కూడా ఈషా ఫోజులకు ఫిదా అయింది. 

click me!

Recommended Stories