సాగరకన్యే దిగొచ్చిందా.. భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న శిల్పాశెట్టి..

First Published | Feb 26, 2021, 9:09 AM IST

`సాహస వీరుడు సాగర కన్య` చిత్రంలో సాగర కన్యగా తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది శిల్పా శెట్టి. సినిమాల్లోనే కాదు నిజంగానూ శిల్పా శెట్టి స్లిమ్‌ బాడీతో సాగర కన్యలాగే ఉంటుందని చెబితే అది అతిశయోక్తి కాదు. తాజాగా ఈ అమ్మడు తన భర్తతో కలిసి మాల్దీవుల్లో సేదతీరుతుంది. తెగ ఎంజాయ్‌ చేస్తుంది. ఆయా వీడియోలు, ఫోటోలను పంచుకుని ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది.

శిల్పా శెట్టి తన భర్త రాజ్‌ కుంద్రాతో కలిసి ప్రస్తుతం మాల్దీవుల్లో చక్కర్లు కొడుతుంది. నీలి సముద్రంలో కలియ తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తుంది.
సరికొత్త అనుభూతిని పొందుతుంది శిల్పా శెట్టి. తమ పిల్లల్ని తీసుకెళ్లిందో లేదోగానీ భర్తతో కలిసి మాత్రం మాల్దీవుల్లో రెచ్చిపోయి ఎంజాయ్‌ చేస్తుండటం విశేషం.

తాజాగా ఆయా ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది శిల్పా శెట్టి. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి.
ఇందులో శిల్పా శెట్టి సాగర కన్యలాగా మారి వయ్యారాలు ఒలకబోసింది. సముద్రం డ్రెస్సులో, బికినీ అందాలతో మెరిసింది. అందాలు ఆరబోసింది.
శిల్పా ఫోటోలను చూసిన అభిమానులు సైతం నిజంగానే నువ్వు సాగరకన్యలా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా మాల్దీవుల్లో ఫోటోలను పంచుకుంటూ `నా జీవితంలోని ప్రేమతో స్వర్గంలో ఉన్నామ`ని పేర్కొంటూ శిల్పాశెట్టితో దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు.
శిల్పాశెట్టి 2009లో రాజ్‌ కుంద్రాను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి కుమారుడు వియాన్‌, కుమార్తె సమీషా ఉన్నారు.
పెళ్లి తర్వాత దాదాపు 13 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శిల్పా శెట్టి ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం `నిక‌మ్మ`, `హంగామా 2` చిత్రాల్లో నటిస్తుంది.

Latest Videos

click me!