శిల్పాశెట్టి కమ్‌ బ్యాక్‌.. `సూపర్‌ డ్యాన్సర్‌ 4` టీమ్‌ స్వాగతంతో నటి ఎమోషనల్‌

Published : Aug 21, 2021, 11:44 AM IST

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి మళ్లీ `సూపర్ డ్యాన్సర్‌4` షోకి కమ్ బ్యాక్‌ అయ్యారు. నెల రోజుల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ డ్యాన్స్ షోకి అడుగుపెట్టింది. దీంతో షో నిర్వహకులు స్వాగతంతో శిల్పాశెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. ఊహించని విధంగా తనకు స్వాగతం పలకడం ఆమెకి భావోద్వేగానికి గురి చేసింది.

PREV
16
శిల్పాశెట్టి కమ్‌ బ్యాక్‌.. `సూపర్‌ డ్యాన్సర్‌ 4` టీమ్‌ స్వాగతంతో నటి ఎమోషనల్‌

శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యూడీషియల్‌ కస్టడీ నుంచి వారం రోజులపాటు రిలీఫ్‌ దొరికింది. అయితే ఈ కేసు విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. 
 

26

రాజ్‌కుంద్రా చేసిన పనికి శిల్పాశెట్టి అనేక అవమానాలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఆమెపై, ఆమె కుటుంబంపై అనేక ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అనేక కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. 

36

ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి.. తన భర్తపై ఆరోపణలు వచ్చిన వెంటనే ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్న `సూపర్‌ డ్యాన్సర్‌ 4` షో నుంచి తప్పుకున్నారు. తాత్కాలికంగా షో నుంచి తప్పుకోవడంతో నిర్వహకులు ఇతర నటీమణులతో గెస్ట్ జడ్జ్ లుగా భర్తీ చేసి షోని రన్ చేశారు. 

46

సరిగ్గా నెల రోజుల తర్వాత మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యింది శిల్పాశెట్టి. తిరిగి ఈ వారం ఆమె డ్యాన్స్ షోకి జడ్జ్ గా వచ్చారు. అయితే తనకు షోలో దక్కిన స్వాగతానికి శిల్పాశెట్టి ఎమోషనల్‌ అయ్యారు. నెల రోజులపాటు తాను ఎంతో మానసిక సంఘర్షణ అనుభవించింది. ఇమేజ్‌ మొత్తం డ్యామేట్‌ అయ్యింది. ఈ నెల వారికి ఛాలెంజింగ్‌గా సాగిందని చెబుతూ ఆమె పంచుకున్న నోట్‌ ఆ మధ్య వైరల్‌గా మారింది. 

56

మరోవైపు షోలో ఓ చిన్నారి చేసిన డాన్సు కి ముగ్దురాలైన శిల్పాశెట్టి స్టేజ్‌పైకి వచ్చి ఆ పాపని హగ్‌ చేసుకుని, నుదుట బొట్టు పెట్టి ఆశీర్వదించింది.ఆ పాపతో కలిసి డాన్సు చేసి నూతనోత్సాహాన్ని పొందింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రోమోలు నెటింట్ట వైరల్‌ అవుతున్నాయి. 

66

ఇప్పుడు ఆ బాధ నుంచి రిలీఫ్‌ పొందేందుకు, దాన్నుంచి కాస్తైనా మనశ్శాంతి పొందేందుకు షోకి రావాలని నిర్ణయించుకుందట. ఈ షోలో ఆమె ఈ విషయాన్ని పేర్కొంటూ కన్నీళ్లు పెట్టుకుంది. జీవితంలో బ్యాడ్‌ డేస్‌ కూడా ఉంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories