Prema Entha Madhuram: అను మీద తప్పు వేసిన శారదమ్మ.. వాళ్ల రాకతో ఆర్యకు అను కనిపించనుందా?

First Published May 27, 2023, 10:57 AM IST

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకొని నెంబర్ వన్ సీరియల్ గా కొనసాగుతుంది. తన భార్య తనని వదిలి ఎందుకు వెళ్లిపోయిందో కారణం తెలియక తల్లడిల్లి పోతున్న ఒక భర్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో కూరగాయలు అమ్మడానికి బయలుదేరుతుంది అను. అదే సమయంలో జెండే,ఆర్య ఒక కారులో నీరజ్ మరో కారులో అనుని వెతకటానికి బయలుదేరుతారు. దేవుడా మా దాదా కి వదినమ్మ కి ఎందుకన్ని కష్టాలు వాళ్ళని ఎప్పుడూ మ్యూచువల్ గా ఉండనివ్వవా అని దేవుడిని తిట్టుకుంటాడు నీరజ్. మరోవైపు జెండేని కారు ఆపమంటాడు ఆర్య.
 

కారు దిగిన తర్వాత అను దొరకలేనందుకు ఫ్రెస్టేట్ అవుతూ ఉంటాడు. జెండే వచ్చి ధైర్యం చెబుతాడు. హాస్పిటల్ కి దగ్గర్లో ఉన్న ఏరియాలు ఏంటి అని అడుగుతాడు ఆర్య. పటాన్చెరు హాస్పిటల్ కి బాగా దగ్గర్లో ఉంటుంది అంటాడు జెండే. కచ్చితంగా అను అక్కడే ఉండి ఉంటుంది. సిటీలో మాత్రం ఉండదు పద అక్కడికే వెళ్లి వెతుకుదాం అంటాడు ఆర్య.
 

 పటాన్చెరువు దగ్గరికి వచ్చి కారు ఆపి ఫోటో చూపించి ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. అదే సమయానికి అను అక్కడే కాయగూరలు అమ్ముతూ ఉంటుంది. జెండాను చూసి కంగారుపడుతుంది చీర చెంగు కప్పుకొని కిందన కూర్చుండిపోతుంది. అదే కాయగూరలు బండి దగ్గరికి వచ్చి అక్కడ కాయగూరలు కొనుక్కునే వాళ్లకి అను ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు జెండే.
 

కూర్చున్న అనువైపు చూస్తారు కస్టమర్లు. చెప్పొద్దు అన్నట్లుగా రిక్వెస్ట్ చేస్తుంది అను. దాంతో చూడలేదు అని చెప్తారు ఆ కస్టమర్లు. ఆఖరికి ముసుగేసుకొని ఉన్న అనుకి కూడా ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూశారా అని అడుగుతాడు జెండే. చూడలేదు అంతంతో అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆర్య వాళ్ళు. ఏదైనా ప్రాబ్లమా ఎందుకు వాళ్ళని చూసి అంతలా భయపడుతున్నావు అని అడుగుతారు కస్టమర్లు.
 

ఏం లేదమ్మా అని మాట దాట వేస్తుంది అను. మరోవైపు నీరజ్, ఆర్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంజలి, శారదమ్మ. ఇంతలో నీరజ్ రావడంతో అనుజాడ దొరికిందా అని అడుగుతుంది శారదమ్మ. లేదు అంటాడు నీరజ్. ఆర్య ఎక్కడ అని అడుగుతుంది శారదమ్మ. సిటీ ఔట్స్కట్స్ లో వెతుకుతున్నారు అంటాడు నీరజ్. ఇంతలో అను డొనేట్ చేయడం వలన డెవలప్ అయిన గుడికి సంబంధించిన వ్యక్తులు వస్తారు.
 

మీరు ఇచ్చిన డబ్బులతోనే గుడిని డెవలప్ చేసాము రేపు ధ్వజస్తంభ స్థాపన మీ చేతుల మీదుగా జరగాలని మా కోరిక దయచేసి రండి అంటూ ఆహ్వానిస్తారు. సరే అని ఒప్పుకుంటుంది శారదమ్మ. గుడి అమ్మవారి చీర తీసుకొచ్చాము అనుకోండి అని శారదమ్మతో చెప్తుంది వచ్చినావిడ. అంజలిని తీసుకోమంటుంది శారదమ్మ. ఈ ఇంటి పెద్ద కోడలు అనురాధ ఆమె పేరు మీదుగా ఇవ్వండి అంటుంది అంజలి.
 

అను యే ఇంట్లో లేనప్పుడు ఇంకా తన పేరు మీద ఎందుకు? చిన్న కోడలు నేనున్నాను నేనే తీసుకుంటాను అంటూ వాళ్ళ దగ్గర నుంచి ఆ పళ్ళాన్ని లాక్కుంటుంది మాన్సీ. నీరజ్ మందలించినా వినిపించుకోదు. ఇంతలో ఆర్య ఇంటికి వస్తాడు. శారదమ్మ వాళ్ళని పరిచయం చేస్తుంది. ఆర్య ని కూడా రమ్మనమని ఆహ్వానించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు. రేపు గుడికి వెళ్లడానికి సంబంధించిన పనులన్నీ నువ్వే చేయాలి అని జెండే కి అప్పగిస్తుంది శారదమ్మ. మీరు వెళ్ళండి నేను జెండే అనుని వెతకడానికి వెళ్తాము అంటాడు ఆర్య. 

దేవుని కార్యాలు పక్కన పెట్టకూడదు అది శుభం కాదు అక్కడికి వెళ్తే అంతా మంచే జరుగుతుంది అంటుంది శారదమ్మ. నేను ఏమీ పాపాలు చేశానని నాకు ఇలాంటి శిక్ష వేశాడు దేవుడు. రేపు పూజ చేసినంత మాత్రాన మంచి చేస్తాడని నేను అనుకోను. నాకు అక్కడికి రావటం ఇష్టం లేదు అంటాడు ఆర్య. ఒక్కొక్కసారి కష్టాలు మనుషులని మంచి మార్గంలో పెట్టడానికి వస్తాయి. అయినా అను నీకు దూరమైందంటే అందుకు కారణం పూర్తిగా అనుదే. నిజం చెప్పటానికి భయపడిందో లేకపోతే భ్రమనే నిజమనుకుందో తెలియదు కానీ మనతో చెప్పకుండా వెళ్ళిపోవటం తనదే తప్పు.
 

అయినా ఏమో రేపు గుడిలో పూజ చేయడం వల్ల నీ భార్య బిడ్డలు దొరుకుతారేమో. యద్భావం తద్భవతి మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ఈ ఒక్కసారి నా మాట నమ్మి నాతో రా అంటూ కొడుక్కి నచ్చ చెప్తుంది శారదమ్మ. సరే నీ ఇష్టం అంటూ ఒప్పుకుంటాడు ఆర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!