Shanmukh- Deepthi Sunaina: దీప్తి- షణ్ముఖ్ ను కలిపే బాధ్యత తీసుకున్న బిగ్ బాస్..? ముహూర్తం కూడా ఫిక్స్..

Published : Feb 02, 2022, 09:05 AM IST

సోషల్ మీడియా లవ్ బర్డ్..సెలబ్రిటీ లవర్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది షణ్ముఖ్ జస్వంత్ – దీప్తి సునయనపేర్లే. రెండు సార్లు బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట.. ఇప్పుడు మరోసారి కలవబోతున్నట్టు తెలుస్తోంది.

PREV
17
Shanmukh- Deepthi Sunaina: దీప్తి- షణ్ముఖ్ ను కలిపే బాధ్యత తీసుకున్న బిగ్ బాస్..?  ముహూర్తం కూడా ఫిక్స్..

యూట్యూబ్‌ స్టార్‌ లవ్‌బర్డ్స్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌- దీప్తి సునయన కు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా వీరు రెండో సారి బ్రేకప్‌ చెప్పుకున్న సంగతి తెలిసిందే.దీనికి కారణం బిగ్ బాస్ లో సిరీతో షణ్ముఖ్ మితిమీరిన హగ్గులు.ముద్దులే అని నెట్టింట్లో గట్టిగానే ప్రచారం జరిగింది.అంతేకాదు వీరిద్దరూ బ్రేకప్‌ మీడియాల్లో హాట్‌టాపిక్‌ గా మారింది.

27

యూట్యూబ్‌లో వీరిద్దరి పేర్‌కు, చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు.ఎప్పటి నుంచో ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరు..ఆన్ స్క్రీన్ పై కూడా అదేబాండింగ్ తో..అదే కెమిస్ట్రీతో లక్షల్లో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.  అయితే చిన్న చిన్న కాణాలతో వీరు బ్రేకప్ చెప్పుకోవడం వీరిప్యాన్స్ కు నచ్చలేదు. మళ్లీ వీరిద్దరు కలిస్తే బాగుండు అని చాల మంది ఇప్పటికీ కోరకుంటున్నారు. కామెంట్ రూపంలో చెపుతున్నారు కూడా.

37

అయితే అందరి హోప్ ఇప్పుడు వచ్చే 14 డేట్ పైనే ఉంది. ఆరోజు వాలంటైన్స్ డే సందర్భంగా అయినా వీరి జంట మళ్ళీ తెరపై సందడి చేస్తే బాగుండు అని చాల మందిఫ్యాన్స్ కోరకుంటున్నారు. ప్రేమికుల రోజున వీరు రియలైజ్ అయ్యి..మళ్లీ కలిస్తే.. సోషల్ మీడియాలో పండగచేసుకోవాలని చూస్తున్నారు.  

47

ఆ మధ్య షణ్మఖ్‌ తండ్రి కూడా మళ్లీ వీరిద్దరూ కలుస్తారంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో కొంచెం హోప్ వచ్చింది ఫ్యాన్స్ లో. కాని దీప్తి సునయనకు మళ్ళీ షణ్నుతో కలిసే ఉద్దేశం లేనట్టే కనిపిస్తుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈనెల 14న వాలంటైన్స్‌ డే రోజున షణ్ను-దీప్తిలు కలవబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

57

అంతేకాదు ఈ బాధ్యతను స్వయంగా బిగ్‌బాస్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది.బిగ్ బాస్ షో విరికలయికకు వేదిక కాబోతోందని ప్రచారం జరుగుతుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా గ్రాండ్‌ సెలబ్రెషన్స్‌కు ప్లాన్‌ చేశారట బిగ్ బాస్ టీమ్. ఆ రోజు 5 సీజన్ల బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ను ఆహ్వానించి పెద్ద ఉత్సవం చేయబోతున్నట్లు సమాచారం.

67

అంతే కాదు అదే రోజు.. అంటే పిబ్రవరి 14న  బిగ్‌బాస్‌ ఓటీటీ కూడా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. దీంట్లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్స్‌ సందడి చేయబోతున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ ఈవెంట్ కు సంబధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిందని.. చాలా వరకూ షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులోనే దీప్తి సునయనకు మళ్ళీ షణ్నుతో మళ్లీ కలవబోతున్నట్టు ప్రకటన చేస్తారని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

77

ఈ ఈవెంట్ లో షణ్ముఖ్-దీప్తిలను జంటగా చూపించే ప్రయత్నంచేస్తున్నారట షో నిర్వాహకులు. దీంతో వారి మధ్య మళ్లీ కెమిస్ట్రీ పెరిగి ఒకరిని మరొకరు అర్ధం చేసుకునే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. అయితే  ఈ విషయంలో నిజమెంతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ అవుతోంది.  

click me!

Recommended Stories