ప్రస్తుతం జయలలిత `ప్రేమ ఎంత మధురం` అనే సీరియల్‌లో నటిస్తుంది. ఇందులో ఆమె ఆర్యకి తల్లిగా శారదాదేవి పాత్రలో తన నటనతో మెప్పిస్తుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి, తన మ్యారేజ్ లైఫ్ గురించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించింది. ముప్పై ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పింది.
మలయాళంలో ఇండస్ట్రీలో తాను వ్యాంప్ పాత్రలతోనే పరిచయం అయ్యానని తెలిపింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి వినోద్ అలాంటి సినిమాలు తీసే వ్యక్తి అని పేర్కొంది. వినోద్ వాళ్ల నాన్న ప్రముఖ నిర్మాత ఆళ్లపుర పురుషన్. వినోద్ బూతు సినిమాలతోపాటు భక్తిరస చిత్రాలు కూడా తీసేవారు. అదే సమయంలో డీ గ్రేడ్ సినిమాలు చేసేవారు. వాటిలో తానే హీరోయిన్ అని చెప్పింది.
`ఓ రోజు క్రాస్ బెల్ట్ మనీ వాళ్లకి వీళ్లకి ఒకే డేట్ ఇచ్చారు నాన్నగారు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నేను వాళ్ల షూటింగ్‌కి వెళ్లలేదు. క్రాస్ బెల్ట్ మనీ అంటే మీనా వాళ్ల మామయ్య. ఆయన కూడా ఈ టైప్ సినిమాలు చేసేవారు. నేను వినోద్ సినిమా చేస్తుండగా, వాళ్లు షూటింగ్ లొకేషన్‌లోకి వచ్చి గొడవ చేశారు. ఆ టైమ్‌లో వినోద్ నన్ను సేవ్ చేశారు. నన్ను రూంలో పెట్టి లాక్‌చేశాడు. ఆ ఘటనతో వినోద్‌తో కనెక్ట్ అయిపోయా. ఆ సమయంలో హీరోలాగానే కనిపించాడు` అని పేర్కొంది.
అప్పటి నుంచి ఇద్దరం కలిసి ఏడేళ్లు ప్రేమించుకున్నామని, ఏడేళ్ల ప్రేమ తర్వాత నాకు డౌట్ వచ్చిందని, ఇది కరెక్ట్ కాదేమో అనిపించిందట. కానీ వినోద్ తనని కంగారు పెట్టాడని, పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడని, దీంతో వినోద్‌ని పెళ్లి చేసుకున్నానని చెప్పింది జయలలిత. అయితే ఆర్నెళ్లకే ఆయన అసలు రూపం బయటపడిందట.
`ఏడాది పాటు వినోద్‌తో కలిసి ఉన్నా. నా ఆస్తి కోసమే అతను నన్ను పెళ్లి చేసుకున్నాడని అర్థం అయ్యిందని అప్పులు తీర్చడం కోసం నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నన్ను చిత్ర హింసలు పెట్టాడు. మా పెళ్లి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో వాళ్ల దగ్గర నాకు ముఖం లేదు. పైగా నేను దాచుకున్న డబ్బు తీసుకుని వెళ్లి మా అత్తగారికి ఇచ్చాను. కానీ ఏడాదిలోపే పెళ్లి పెటాకులైంది` అని చెప్పింది.
ప్రస్తుతం జయలలిత పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. తన మేనమామ కొడుకు భాస్కర్‌తో కలిసి ఉంటుందట. తన డేట్స్, అకౌంట్స్ మొత్తం ఆయనే డీల్ చేస్తున్నారని తెలిపింది. తన కోసం ఆయన కూడా పెళ్లి చేసుకోలేదని చెప్పింది.
అంతేకాదు నేటి అమ్మాయిలకు మంచి సందేశం ఇచ్చింది జయలలిత. సినిమాల్లోకి రావాలనుకునే అమ్మాయిలు దయజేసి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలిపింది. బాగా చదువుకుని, మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. సినిమాల్లోకి మాత్రం రావద్దని స్పష్టంచేసింది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తానుచూశానని, అందుకు చెబుతున్నానని పేర్కొంది.
కెరీర్ ప్రారంభ విషయాలను పంచుకుంటూ, మొదట్లో దర్శకుడు కె.విశ్వనాథ్ తనని సినిమాల్లోకి రావద్దని నిరుత్సాహపరిచారని పేర్కొంది. `నేను బ్రాహ్మణ అమ్మాయిని. డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు విశ్వనాథ్ గుంటూరు వస్తుండేవారు. విశ్వనాథ్ మేనల్లుడు ఇంట్లో మేం రెంట్‌కి ఉండేవాళ్లం. అతను మెడికల్ రిప్రజెంటేటివ్. వాళ్ల ఇంట్లో ఉన్నప్పుడు నేను నచ్చి ఆయనకిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు. అయితే మా నాన్న ముందు ఒప్పుకుని, తీరా ఎంగేజ్‌మెంట్ టైమ్‌లో పారిపోయారని, దీంతో ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యింద`ని చెప్పింది జయలలిత.
అయితే తాను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు కె.విశ్వనాథ్‌గారు డిస్కరేజ్ చేశారట. `నువ్వు బ్రాహ్మణులు అమ్మాయివి. నీకెందుకిది, డిగ్రీ చదివావు మంచి డాన్స్ ప్రోగ్రామ్‌లు చేసుకో అని, మంచి సంబంధించి చూసుకుని పెళ్లి చేసుకో అని చెప్పారట. కానీ ఆ తర్వాత ఆయన ఎందుకు చెప్పారో అర్థమయ్యిందని చెప్పింది జయలలిత.
ఇప్పుడు చిన్న చిన్న పాత్రలు, సీరియల్స్ చేస్తున్న జయలలిత ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించిన విషయం తెలిసిందే. మలయాళంలో బీగ్రేడ్ చిత్రాలతో ఓ ఊపు ఊపింది. వ్యాంప్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. తెలుగు, మలయాళం ఇండస్ట్రీలో దాదాపు 100కి పైగా చిత్రాల్లోనే నటించింది. `సత్యాగ్రహం`, `శృతిలయలు`, `ఇంద్రుడు చంద్రుడు`, `అగ్గిరాముడు`, `లారీ డ్రైవర్`, `ఎర్రమందారం`, `ఏప్రిల్ 1 విడుదల`, `అప్పుల అప్పారావు`, `ముఠామేస్త్రి` ఇలా అనేక తెలుగు సినిమాల్లో నటించింది మెప్పించింది.