Tollywood Senior Heroes: జోరుమీదున్న సీనియర్ హీరోలు.. కుర్ర హీరోలకు చుక్కలు చూపిస్తున్నారుగా..

First Published Jan 23, 2022, 10:55 AM IST

టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలు జోరు మీద ఉన్నారు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. పోటీ ఇవ్వడం కాదు.. యంగ్ స్టార్స్ ను పక్కకు నెట్టి దూసుకుపోతున్నారు. వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో తారాజవ్వల్ల ఎగురుతున్నఏజ్ బార్ హీరోల  గురించి ఇప్పుడు చూద్దాం..

అసలే టాలీవుడ్ లో కుర్ర హీరోలకు హిట్లు పడటం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ ను అందుకోలేకపోతున్నారు. యంగ్ స్టార్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముఖ్యంగా శర్వానంద్, నాగశౌర్య, సాయి ధరమ్ తేజ్, లాంటి హీరోలను ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. సరిగ్గా ఇదే టైమ్ లో సీనియర్ స్టార్ హీరోలు రెచ్చిపోతున్నారు. వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ కు మూల స్థంభాల్లాంటి నలుగురు హీరోల జోరకు కుర్ర హీరోల ఫీజులు ఎగిరిపోతున్నాయి.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పీడ్ కు టాలీవుడ్ దడదడలాడిపోతుంది. రీ ఎంట్రీ తరువాత ఆయన జోరు మామూలుగా లేదు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు మెగాస్టార్. ఆచార్య తరువాత ఆయన జోరు పెరిగింది. ఆచార్య ఆయన 152 మూవీగా స్టార్ట్ అయ్యింది.  కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. రెండు మూడు రిలీజ్ డేట్లు మార్చుకుని ఫైనల్ గా ఏప్రిల్ 1కి చేరింది ఆచార్య.

మెగాస్టార్ ఆచార్య(Acharya) తరువాత గ్యాప్ లేకుండా సినిమాలు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. మోహన్ రాజా డైరెక్షన్ లో మలయాళ మూవీ లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ మూవీ తెరకెకుతోంది. గాడ్ ఫార్ మెగాస్టార్(Megastar Chiranjeevi)  కు 153వ సినిమా కాగా.. చిరు 154వ సినిమా బాబీ డైరెక్షన్ లో రూపొందుతోంది. ఈ సినిమాకు వాల్తేరు వీర్రాజు టైటిల్ అనుకుంటున్నారు. ఇక 155వ మూవీగా మోహర్ రమేష్ డైరెక్షన్ లో భళా శంకర్ మూవీ లైన్ లో ఉంది. ఈ సినిమాలన్నీ ఓపెనింగ్ అయిపోగా.. మరికొన్ని సినిమాలు కూడా మెగాస్టార్ సెట్స్ ఎక్కించబోతున్నారు.

ఇక రెస్ట్ లెస్ గా సినిమాలు చేయాలి అని ఫిక్స్ అయ్యారు చిరంజీవి(Megastar Chiranjeevi)  అందుకే ఒకదాని వెంట మరొకటి సినమా అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. మెగాస్టార్ 156వ సినిమాను యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములకు ఇచ్చారు. రీసెంట్ గా ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక 157 వ సినిమా మారుతీతో, 158వ సినిమా అనిల్ రావిపూడితో దాదాపు ఫిక్స్ అయినట్టే తెలుస్తోంది. ఇలా వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ..మెగాస్టారా.. మజాకా అనిపిస్తున్నాడు చిరంజీవి.

ఇక సీనియర్ హీరోలలో మంచి జోరుమీద ఉన్న మరో హీరో నటసింహం బాలయ్య బాబు(Balakrishna). ఆయన స్పీడ్ కు.. ఆయన పవర్ కు టాలీవుడ్ జయహో బాలయ్య అంటోంది. ఎందకుంటే అటు సినామాల తో పాటు ఇటు బుల్లి తెర షోను కూడా పరుగులు పెట్టించాడు బాలయ్య. ఇంత కరోనా పొండమిక్ టైమ్ లో కూడా బాలయ్య (Balakrishna) అఖండ రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించింది. అటు స్టార్ సెలబ్రిటీ గెస్ట్ లతో ఆహా యాప్ లో అన్ స్టాపబుల్ అంటూ అదరగొడుతున్నాడు బాలకృష్ణ.

సినిమాల విషయంలో కూడా తగ్గేదే లే అంటున్నాడు బాలయ్య(Balakrishna). అఖండ సినిమా జోష్ తో మలినేని గోపీచంద్ తో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు వేటపాలెం టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ సినిమాతరువాత అనిల్ రావిపూడితో మూవీ దాదాపు ఫిక్స్అయినట్టే. ఈ సినిమాతో పాటు పూరీ జగన్నాథ్ కూడా బాలయ్య(Balakrishna) కోసం కథ రెడీ చేసుకుని వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాలు అయిపోయే లోపు మరికొంత మంది దర్శకులు బాలయ్య దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు.   

అటు కింగ్ నాగార్జున(Nagarjuna) కూడా తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. ఆరు పదుల వయస్సులో కూడా యంగ్ హీరోలా ఫిట్ గా.. హ్యాండ్సమ్ గా తళతళ మెరిసిపోతున్నాడు నాగ్. అటు బిగ్ బాస్ లాంటి షోస్ చేసుకుంటూనే..సినిమాలు కూడా వరుసగా లైన్ అప్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో తన స్టామినా ఎంటో చూపించాడు నాగ్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బంగార్రాజు 3 రోజుల్లో 50 కోట్ల కలెక్షన్ మార్క్ దాటింది. ఇక ప్రస్తుతం ప్రవీన్ సత్తార్ డైరెక్షన్ లో ది ఘోస్ట్ మూవీ చేస్తున్నారు  నాగార్జున(Nagarjuna). ఆయన నటించిన బాలీవుడ్ మూవీ  బ్రహ్మాస్త్ర  రిలీజ్ కు ముస్తాబు అవుతుంది. ఇక  మరికొన్ని సినిమాలు లైన్ అప్ చస్తున్నారు నాగార్జున తగ్గేదే లేదు అంటున్నారు.

అటు విక్టరీ వెంకటేష్(Venkatesh) కూడా అంతే.. కరోనా వల్ల కొంచెం గ్యాప్ ఇచ్చినా.. ఆయన మొన్నటి వరకూ నారప్ప.. దృశ్యం2 లాంటి సి నిమాలతో బిజీగానే గడిపాడు. ఇప్పుడు  రానా తో కలిసి రానా నాయుడు వెబ్ మూవీ చేస్తున్నాడు వెంకీ. దానితో పాటు ఆహాలో ఓ షోను హోస్ట్ చేయడం కోసం రెడీ అవుతున్నాడు. ఇక సినిమాలపై కూడా దృస్టి పెట్టబోతున్నాడు వెంకీ. కూల్ గా అన్నీ హ్యాండిల్ చేసకుంటూ వెళ్తున్నాడు.

అటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(PawanKalyan) కూడా ఆ మధ్య రెండేళ్లు గ్యాప్ ఇచ్చి.. వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే నాలుగు సినిమాలు లైన్ అప్ చేశాడు పవర్ స్టార్. మంచి కరోనా టైమ్ లోనే వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రానాతో కలిసి నటించిన  భీమ్లా నాయక్ సినిమాతో రిలీజ్ కు రెడీగా ఉన్నాడు. ఈమూవీ తరువాత క్రిష్ తో హరిహరవీరమల్లు సెట్స్ పైన ఉంది. ఆ వెంటనే హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ కూడా సెట్స్ ఎక్కబోతోంది.

Pawan Kalyan

వీటితో పాటు బండ్ల గణేష్ కు ఓ సినిమా చేసి పెడతాను అని చెప్పాడు పవర్ స్టార్. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యే లోపు సురేందర్ రెడ్డి లాంటి మరికొంత మంద దర్శకులతో పవర్ స్టార్ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాలను వరుసగా ట్రాక్ ఎక్కించాని ప్లాన్ చేసుకుంటున్నాడు పవర్ స్టార్. అటు పాలిటిక్స్ ను ఇటు సినిమాలను బాలన్స్ చేసుకుంటూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్.  

click me!