సీనియర్ నటుడు మురళీ మోహన్ అప్పట్లో రెండో పెళ్ళికి సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. ఓ హీరోయిన్ ని ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. దాని గురించి ఆయన ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి.
చిత్ర పరిశ్రమలో ఉన్నప్పుడు నటీనటుల గురించి రూమర్స్ సహజంగా వస్తుంటాయి. గతంలో ఓ సీనియర్ నటుడి పెళ్లి గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సీనియర్ నటుడు ఎవరో కాదు మురళి మోహన్. మురళి మోహన్ నటుడిగా నిర్మాతగా రాణించారు. ప్రస్తుతం ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్నారు.
25
జయచిత్ర, మురళీ మోహన్ రిలేషన్
మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి వచ్చిన రూమర్స్ పై స్పందించారు. అలనాటి హీరోయిన్ జయచిత్ర, మురళి మోహన్ మధ్య ప్రేమ మొదలైనట్లు అప్పటి పత్రికల్లో రూమర్స్ వచ్చాయి. అప్పటికి మురళి మోహన్ కి పెళ్ళై కుమార్తె కూడా ఉంది. అయినప్పటికీ మురళి మోహన్.. జయచిత్రని పెళ్లి చేసుకోబోతున్నాడని, ఇద్దరూ కలసి క్లోజ్ గా తిరుగుతున్నారు అని మీడియాలో వార్తలు వచ్చాయి.
35
ఆల్రెడీ పెళ్లయింది
ఆ రూమర్స్ విని నేను షాక్ అయ్యాను. నాకు ఆల్రెడీ పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు నాకు పెళ్లేంటి అని ఆశ్చర్యపోయాను. అప్పట్లో నాకు మురళి చిత్ర అనే బ్యానర్ ఉండేది. దీనితో జయచిత్ర పేరు వచ్చేలా ఆ బ్యానర్ కూడా స్థాపించాడు అని రూమర్స్ ఇంకా ఎక్కువయ్యాయి.
దీని గురించి ఇండస్ట్రీలో నన్ను కొంత మంది అడిగారు. నిజమా జయచిత్రని పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగారు. అస్సలు ఆయా క్వశ్చనే లేదు. ఆమెని నేను కనీసం పేరు పెట్టి కూడా ఎప్పుడూ పిలవలేదు. ఏవండీ అనే పిలుస్తాను. అలాంటిది మా గురించి ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అడిగినట్లు మురళి మోహన్ తెలిపారు. నేను ఆ రోజు షూటింగ్ లో ఉన్నాను. రాత్రి 11.30 గంటలకు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు వచ్చారు. నా గురించి వస్తున్న వార్తలు ఆయన చెవిన పడ్డాయి.
55
నిర్మాత వార్నింగ్
లొకేషన్ కి రాగానే బాబు నీతో మాట్లాడాలి ఒకసారి లోపలికి రా అని పిలిచారు. తలుపు మూసేసి నన్ను అడిగారు. నీ గురించి పేపర్ లో వచ్చింది నిజమేనా ? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగారు. నువ్వు తప్పు చేయవు అని తెలుసు. కానీ పొరపాటున తొందరపాటు నిర్ణయం తీసుకుంటావేమో అని అడుగుతున్నా అని అన్నారు. నేను జీవితంలో అలాంటి తప్పు చేయను. జీవితాలు నాశనం అయ్యే పనులు చేయను. మీకు తలవంపులు తెచ్చే పరిస్థితి రానివ్వని అని ఆయనకు మాట ఇచ్చాను అని మురళి మోహన్ తెలిపారు.