సావిత్రి అందమైన ముఖాన్ని ఇందులో చిత్రించారు. `సావిత్రి సౌందర్య రహస్యం.. `లక్స్ నా సౌందర్యానికి దివ్యమైనది` అన్నది ఆమె. అది సౌందర్య కారి, అసామన్యమైన లక్స్ నురగ. నా చర్మమును మృదువుగానూ, సొగసుగాను వుంచుతున్నది. పరిమళమైన లక్స్ వుండగా, మరియొకటి నాకెందుకు? మీకు కూడాను` అంటూ ఈ యాడ్‌లో పేర్కొంది.
లక్స్ టాయ్‌లెట్ సబ్బు సినిమా తారలకు సౌందర్యమునిచ్చే శుద్ధమైన, సౌమ్యమగు సబ్బు. నాలుగు వానవెల్లి రంగులలోను, తెలుపులోను ఉన్నది` అని ఈ యాడ్‌లో పేర్కొంది. ఇందులో లక్స్ సబ్బు ఫోటో ఉంది. ఈ కంపెనీకి ఆమె చాలా రోజులు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిందట.