మొదటి రెండు సీజన్లలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రియదర్శి-జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య-దేవియాని శర్మ, అభినవ్ గోమటం-పావని గంగిరెడ్డి జంటలు సీజన్ 3లోనూ అలరించనున్నారు. ఇక ఈ సీజన్3లో అందరికీ పెద్ద సర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించబోతున్నారు. పోస్టర్ చూస్తుంటే ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ పాత్ర కథలో అనూహ్యమైన మలుపులు తీసుకురావటమే కాకుండా, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో పాటు గుర్తుండిపోయేలా డ్రామటిక్ పెర్ఫామెన్స్‌తో సిరీస్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చబోతున్నారు` అని తెలిపింది. ఈ సిరీస్ త్వరలోనే జియోస్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
నటీనటులు: ప‌్రియదర్శి-జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య- దేవియాని శర్మ, అభినవ్ గోమటం-పావని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు
క్రియేటెడ్ బై మహి వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం
దర్శకత్వం: శ్రీరామ్ ఎరగం
నిర్మాతలు: శివ మేక, సాహితి చింతలపూడి
సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్ శిలకోటి
మ్యూజిక్: అజయ్ అరసాడ
రచన: విజయ్ నమోజు, డిఎస్ గౌతమ్