సంతోష్ శోభన్ ‘అన్నీ మంచి శకునములే’రివ్యూ

First Published | May 18, 2023, 2:42 PM IST

నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ లీడ్ రోల్స్ లో వచ్చిన చిత్రం అన్ని మంచి శకునములే. ఈరోజే విడుదలైన ఈ చిత్రం మరి ఎలా ఉందో చూద్దాం.

 

Anni Manchi Sakunamule movie review


ఫీల్ గుడ్ సినిమాలు ఫ్యామిలీలకు పడితే మంచిగా రన్ అవుతాయి. అయితే ఈ ఫ్యామిలీ సినిమాలతో ఓ సమస్య ఉంది. ఏ మాత్రం గాడి తప్పినా ఓటిటిలో చూసే సినిమారా భయ్ అని పెదివి విరిచేస్తాడు..ప్రక్కన పెట్టేస్తాడు సగటు ప్రేక్షకుడు. టైటిల్ లోనే పాజిటివ్ వైబ్ కు ప్రయత్నిచిన దర్శకురాలు గత చిత్రాలు అన్ని ఫ్యామిలీలకు నచ్చే ఫన్, ఎమోషన్ తో కలిసిన లవ్ స్టోరీలే. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే అని ట్రైలర్ ,టీజర్ తో క్లూ ఇచ్చేసారు. దానికి తోడు వరస హిట్స్ ఇస్తున్న స్నప్న సినిమా బ్యానర్ నుంచి రావటంతో బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉంది..అసలు కథ ఉందా..ఉంటే అదేంటి...హిట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న  సంతోష్ శోభన్ కు సంతోషం కలిగించే కంటెంట్ ఉన్నదేనా?


స్టోరీ లైన్:

రెండు కుటుంబాలు సుధాక‌ర్ (న‌రేష్‌), ప్ర‌సాద్ (రాజేంద్ర ప్ర‌సాద్‌) గత మూడు తరాలుగా  తమ వారసత్వపు ఆస్ది అయిన కాఫీ ఎస్టేట్  కోసం కోర్టుకెక్కి కొట్టుకుంటూంటారు. ఈ లోగా సుధాకర్ భార్య, ప్రసాద్ భార్య ఇద్దరూ ఒకే సమయానికి ఒకే హాస్పటిల్ కు డెలివరీకు వస్తారు. ఒకరికి అమ్మాయి..మరొకరికి అబ్బాయి పుడతారు. అలవైకుంఠపురములో మాదిరిగా ఇక్కడ పుట్టిన పిల్లలు తారుమారు అవుతారు. అంటే పిల్లలు పుట్టిన నాటి నుంచి ఈ విషయం  తెలియకుండా వేరే వాళ్ల దగ్గర పెరుగుతూంటారు. అంతేకాదు దగ్గరలో ఉండటంతో ఒకరితో మరొకరు చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉంటారు.  వాళ్లే రిషి (సంతోష్ శోభ‌న్‌), ఆర్య (మాళ‌విక నాయ‌ర్‌). అయితే అలా స్నేహితుల్లా ఉంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. హీరో గారికి హీరోయిన్ పై మనస్సు అవుతుంది. కానీ చెప్పలేకపోతాడు. వీళ్లిద్దరూ తరుచూ దెబ్బలాడుకుంటూ, కలుసుకుంటూ కాలక్షేపం చేస్తూంటారు. పెరిగి పెద్దై ఇక పెళ్లి వయస్సు వచ్చాక ఆమెకు ఎంగేజ్మెంట్ సెట్ అవుతుంది. అంతే కాదు ఆ తర్వాత ఆమెకు మన వాడి లవ్ గురించి అప్పుడు తెలుస్తుంది. ఓ ప్రక్కన పెళ్లి దగ్గర పడుతోంది. మరో ప్రక్క నువ్వే కావాలి టైప్ లో మనస్సులో ప్రేమను కళ్ల తోనే వ్యక్తం చేసుకుంటూంటారు. ఇది ఎంతదాకా లాగుతారు అంటే తాము చిన్నప్పుడు తారు మారు అయిన విషయం బయిటపడేంతవరకూ. అప్పుడు వాళ్లిద్దరూ ఏం చేసారు. చివరకు ఈ ప్రేమ కథ ఎలా ఓ కొలిక్కి వచ్చింది. తారుమారు మేటర్ ఎలా బయిటపడింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:

ఈ సినిమా ఫస్టాఫ్ అయ్యేసరికి మనకు కుప్పలు తెప్పలుగా తెరనిండా తిరుగుతున్న పాత్రలని చూసి, అసలు వాళ్లు ఒకరికి ఒకరికి ఏం అవుతారో తెలియక..ఎవర్రా మీరంతా అని అడగాలనిపిస్తుంది. అలాగే అసలు కథ కూడా ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలినంత కన్ఫూజ్ గా ఉంటుంది. ఇది కాఫీ ఎస్టేట్ గొడవా లేక ఇద్దరు చిన్ననాటి స్నేహితుల ప్రేమ కథా..లేక తారుమారున పిల్లలు కలిసే కథా అనేది క్లారిటీ ఉండదు. అలా సినిమా ప్రారంభం నుంచే శకునమలు అన్నీ తేడా కొట్టడం మొదలెడతాయి. అయితే నీట్ గా ఉండే విజువల్స్...కొన్ని  నవ్వించే డైలాగులుతో  ఫస్టాఫ్ ..పార్ట్ లు పార్ట్ లుగా బాగుంది. కొన్ని చోట్ల నవ్వించినా,ఎక్కువ శాతం బోర్ కొట్టించటం ఇబ్బందిగా మారింది. ఇంట్రవెల్ కు కూడా అసలు కథలో రాలేదు.  1950 ల నాటి ఏ హిందీ సినిమాని అయినా తీసుకుని  ఇప్పుడు ఏమన్నా రీమేక్ చేసారేమో.. అని డౌట్ కొడుతూంటుంది.  ఫస్టాఫ్ ఇలా ఉంది..పోనీ సెకండాఫ్ అదిరిపోతుందేమో  అని ఎదురుచూస్తే  సెకండాఫ్ లో  కూడా సినిమా ముందుకు వెళ్దామా వద్దా అన్నట్లు  అంతే స్లోగా సాగుతూ వెళ్లింది. 

ఎక్కడా కథను మలుపు తిప్పే సంఘటనలు జరగవు. డైరక్టర్ ఏదో ఫీల్ సీన్స్ క్రియేట్ చేసారని..తెరపై హీరో,హీరోయిన్స్ ఇచ్చే ఎక్సప్రెషన్స్ బట్టి అర్దమవుతుంది. కానీ ఏం ఫీలయ్యారో..మనం ఎలా ఫీలవ్వాలో తెలియదు. ఎమోషన్ సీన్స్ కూడా మనకు పెద్దగా ఏమీ అనిపించవు. అయినా హీరో,హీరోయిన్స్ నిజంగా ప్రేమలో పడ్డారా లేదా అని వాళ్లకే కాదు మనకు అనుమానం వచ్చేస్తుంది. దాంతో వాళ్లు కలిసినా ,కలవకపోయినా పెద్దగా పోయిదేం లేదని వాళ్ల పెద్దవాళ్ల లాగే మనకు వాళ్ల లవ్ పై కన్సర్న్ ఉండదు. ఏదైమైనా కృష్ణవంశీ సినిమాల్లో ఉన్నట్లు గుంపులు గుంపులుగా తెర పట్టనంత మంది జనం ఉన్నంత మాత్రాన ఫీల్ వచ్చేస్తుందా...? పెళ్లి సంబరాలు తెరపై చూపెట్టినంత మాత్రాన నచ్చేస్తుందా..? అయినా సంతోష్ శోభన్ పాత్రకు వేరే వృత్తి దొరకటం లేదా యూట్యూబర్ గా చేస్తూండటమేనా?మొన్నే కదా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అన్నాడు. 

నచ్చినవి

ప్రొడక్షన్ వాల్యూస్

కొన్ని ఫీల్ గుడ్ సీన్స్

అక్కడక్కడా పేలిన కామెడి సీన్స్ 

డైలాగులు
 

నచ్చనవి

స్టోరీ లైన్ గా చెప్పుకోవటానికి కూడా సరపడని కథ
బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే
ఎమోషన్ సీన్స్ ..సినిమాటెక్ గా ఉండి తేలిపోవటం
సంగీతం

టెక్నికల్ గా..

సంతోష్ శోభన్, మాళవిక నాయర్ చిన్నప్పటి సన్నివేశాలు, వారు ప్రేమలో పడటం, మధ్యలో ఫారిన్ లొకేషన్లు...  సినిమాలో చాలా వరకు ఇదే సరిపోయింది. ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి నేపథ్యంలో వచ్చిన గొడవలతో  టర్న్ తీసుకుంది.  అక్కడ నుంచి ఏమీ జరగలేదు.పాల కుండలో నీటి బొట్టులా..స్క్రిప్టు అనేది సరిగ్గా లేకపోతే మిగతా హంగులు ఎన్ని ఉన్నా వృధానే. సినిమాటోగ్రఫీ ప్రకృతి అందాలను తెరపై పరచటంలో సక్సెస్ అయ్యింది. మిక్కీ జె మేయర్  సంగీతం జస్ట్ ఓకే అన్నట్లు ఉంది.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  కూడా నిరాశపరిచాడు. బాగా ఖర్చు పెట్టారు ..ఆ విషయం ప్రతీ ఫ్రేమ్ చెప్తోంది.  బోర్ వచ్చినప్పుడులా కాస్త ఆ సీన్ తీసేస్తే బాగుండేది కదా అని ఎడిటర్ ని అనుకోకుండా ఉండలేము. డైలాగులు కొన్ని చాలా బాగున్నాయి. 


 
ఫెరఫార్మెన్స్ ..

సంతోష్ శోభన్ మంచి నటుడని ఇప్పటికే రుజువు చేసుకున్నాడు. ఈ సినిమాలోనూ అతను ఆకట్టుకున్నాడు. మాళవిక నాయర్   టాలెంటెడ్ నటి అన్నది మరో సారి ప్రూవ్ చేసుకుంది.  గ్లామర్ లుక్స్ పరంగా ఫరియా యావరేజ్ కావడం మైనస్. నరేష్, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, గౌతమి వంటి ఆర్టిస్ట్ లు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది


ఫైనల్ థాట్:

సినిమాలో ఉన్న కథ కేవలం దర్శకుడు, రచయిత కు మాత్రమే కాకుండా చూసేవారికి కూడా అర్దం కావాలి..లేకపోతే ఇలాంటి అనర్దాలే జరుగుతాయి.

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
 

 నటీనటులు : సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు
మాటలు : లక్ష్మీ భూపాల 
ఛాయాగ్రహణం : సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
సంగీతం : మిక్కీ జె. మేయర్
నిర్మాణ సంస్థలు : స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
నిర్మాత : ప్రియాంకా దత్
దర్శకత్వం : బీవీ నందినీ రెడ్డి
విడుదల తేదీ: మే 18, 2023
 

Latest Videos

click me!