మేకప్ లేకుండా షాకిచ్చినా అనసూయ.. బెడ్ పై స్మైలీ ఫేస్ తో దాని గురించి ఆలోచిస్తున్న స్టార్ యాంకర్

First Published | May 18, 2023, 1:18 PM IST

యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. ప్రస్తుతం నటిగా మెప్పిస్తోంది. ఈ క్రమంలో బుల్లితెరకు దూరమై నెట్టింట తన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 
 

‘జబర్దస్త్’ కామెడీ షోతో అనసూయ భరద్వాజ్ బుల్లితెర ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. యాంకర్ గానే ఉండిపోకుండా నటిగా కావాల్సిన ప్రయత్నాలు చేసింది.  స్మాల్ స్క్రీన్ పై అందం, అభినయంతో కట్టిపడేసింది. దాంతో నెమ్మదిగా వెండితెరపై అడుగులు వేసింది.
 

‘రంగస్థలం’, ‘క్షణం’, ‘పుష్ప : ది రైజ్’ వంటి చిత్రాలు అనసూయను వెండితెరపై నటిగా నిలబెట్టాయి. ఈ క్రమంలో బుల్లితెరకు గుడ్ బై చెప్పిన స్టార్ యాంకర్ గా నటిగా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతో బుల్లితెరపై తన ఫ్యాన్స్ ను మునుపటిలా అలరించే ఛాన్స్ లేకుండా పోయింది.  
 


దీంతో సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఖుషీ చేసింది. తాజాగా తన మార్నింగ్ పిక్ ను షేర్ చేసింది. మేకప్ లేకుండా బెడ్ పై నుంచి అలాగే దర్శనమిచ్చింది. 

నేచురల్ అందంతోనూ కట్టిపడేసింది. స్మైలీ ఫేస్ తో ఫ్యాన్స్ ను పలకరించింది. అయితే బెడ్ పైనే ఉండి మార్నింగ్ వర్కౌట్ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నట్టుగా.. అలిసిపోయినప్పటికీ చిరునవ్వుతో ఇలా కనిపించినట్టు క్యాప్షన్ లో పేర్కొంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. 

అనసూయకు అంతలా క్రేజ్ దక్కడానికి కారణం ఆమె చేసే హార్డ్ వర్క్. ఎప్పుడూ నాజుగ్గా, అందంగా కనిపించేందుకు వర్కౌట్స్ చేస్తుంటారు. అందుకు సంబంధించిన  ఫొటోలను కూడా అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయాలంటూ స్ఫూర్తిగా నిలుస్తుంటుంది.
 

ప్రస్తుతం అనసూయ  కేరీర్ నటిగా జోరుమీదనే ఉందని చెప్పాలి.  చివరిగా ‘మైఖేల్’, ‘రంగమార్తండ’ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. మరిన్ని చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో ‘పుష్ప 2 : దిరూల్’ ఒకటి. మరో చిత్రం ‘విమానం’తోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest Videos

click me!