చైతూకి వస్తువులన్నీ తిరిగిచ్చేస్తున్న సమంత.. హాట్‌ టాపిక్‌గా `వెడ్డింగ్‌ శారీ`.. తిరిగిచ్చేసిందా?

Published : Mar 09, 2022, 09:29 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత.. కెరీర్‌ పరంగా బిజీగా మారుతున్న క్రమంలో తరచూ ఆమె చైతూతో మ్యారేజ్‌కి సంబంధించిన విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా సమంత వెడ్డింగ్‌ శారీ విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

PREV
17
చైతూకి వస్తువులన్నీ తిరిగిచ్చేస్తున్న సమంత.. హాట్‌ టాపిక్‌గా `వెడ్డింగ్‌ శారీ`.. తిరిగిచ్చేసిందా?

సమంత(Samantha), నాగచైతన్య(Naga Chaitanya) ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2010లో ప్రారంభమైన వీరి ప్రేమ 2017లో మ్యారేజ్‌తో శుభంకార్డు పడింది. కానీ ఎండ్‌ కార్డ్ మాత్రం నాలుగేండ్ల తర్వాత డైవర్స్ తో పడింది. గతేడాది అక్టోబర్‌ 2న వీరిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అందరిని షాకిచ్చే నిర్ణయంతో అభిమానులు గుండెల్ని బ్రేక్‌ చేశారు. ఇప్పటికీ చాలా మంది సమంత, చైతూ విడిపోయారంటే నమ్మలేని పరిస్థితి.

27

అయితే Samantha, నాగచైతన్య తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌పెట్టి కెరీర్‌ పరంగా ఎవరికి వారు బిజీగా ఉన్నారు. వరుస సినిమాలకు కమిట్‌ అవుతూ సమంత దూసుకుపోతుంది. మరోవైపు నాగచైతన్య సైతం బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. తమ జీవితంలో బాధాకర ఘటనలు గుర్తు రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. 

37

ఈ నేపథ్యంలో ఇప్పుడు చైతూ, సమంత మ్యారేజ్‌కి సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌ అవుతుంది. మ్యారేజ్‌లో సమంత ధరించిన వెడ్డింగ్‌ శారీ ఎవరి వద్ద ఉందనేదానిపై చర్చ నడుస్తుంది. ఆ శారీ ఆమె నాగచైతన్యకి తిరిగి ఇచ్చేసిందా? తన వద్దే ఉంచుకుందా? అనే చర్చ మొదలైంది. ఈ చర్చకి కారణం ఆ వెడ్డింగ్‌ శారీ చాలా ప్రత్యేకమైనది. దానికో స్టోరీ కూడా ఉంది. 

47

ఆ వివరాలు చూస్తే, చైతూతో మ్యారేజ్‌లో సమంత ధరించిన పెళ్లి శారీ కొత్తగా కొన్నది కాదు, తయారు చేయించింది కూడా కాదు. అది నిర్మాత రామానాయుడు భార్య దగ్గుబాటి రాజేశ్వరిది. నాగచైతన్య దగ్గుబాటి రామానాయుడుకి మనవడు అనే విషయం తెలిసిందే. రామానాయుడు కూతురు లక్ష్మీ, నాగార్జునలకు జన్మించారు. అలా ఈ రెండు కుటుంబాల మధ్య చాలా అనుబంధం ఉంది. పైగా చైతూ చాలా వరకు దగ్గుబాటి వారి ఫ్యామిలీలోనే పెరిగారంటుంటారు. 

57

అయితే నాగచైతన్య పెళ్లి సమయంలో తన అమ్మమ్మ శారీని సమంత చేత వెడ్డింగ్‌ శారీగా కట్టించారట. ఆ శారీ దగ్గుబాటి కుటుంబానికి చెందినది కాబట్టి సమంత ఇప్పుడు చైతూతో విడిపోయిన నేపథ్యంలో ఆ చీరని చైతూకి తిరిగి ఇచ్చేసిందని తెలుస్తుంది. అంతేకాదు చైతన్యకు సంబంధించిన ఏ వస్తువును కూడా తన వద్ద ఉంచుకోకూడదని  నిర్ణయించుకుందంట సామ్‌. అందువల్ల ఆ శారీని కూడా రిటర్న్ చేసిందని అటు ఫిల్మ్ నగర్‌లో,ఇటు సోషల్‌ మీడియాలో ఓ వార్త కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంతా తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడిది పెద్ద చర్చకి దారితీయడం విశేషం. 

67

నాలుగేండ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటనతో అందరికి షాకిచ్చిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు విడిపోవడానికి స్పష్టమైన కారణాలేంటనేది ఇప్పటికీ బయటకు రాలేదు. ఇక వీరిద్దరు కలిసి `ఏం మాయ చేసావె` చిత్రంలో నటించారు. ఆ చిత్రంతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి,పెళ్లి వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ గ్యాప్‌లో వీరిద్దరు `మనం`, `ఆటోనగర్‌ సూర్య`, మ్యారేజ్‌ తర్వాత `మజిలీ` చిత్రాలు చేశారు. 

77

ప్రస్తుతం సమంత `శాకుంతలం`, `యశోద`, `కాతు వాకుల రెండు కాదల్‌`, డ్రీమ్‌ వారియర్స్ చిత్రం, ఓ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ చేస్తుంది. నటిగా బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు చైతూ `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే విక్రమ్‌ కుమార్‌తో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. దీంతోపాటు విక్రమ్‌ ప్రభుతో ఓ సినిమా చేస్తున్నారు. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో నటిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories