జనరల్‌గా స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంటుంది. కానీ ఫస్ట్‌టైమ్ ఇద్దరు హీరోయిన్ల అభిమానుల మధ్య వార్ స్టార్ట్ అయ్యింది. సమంత, పూజా హగ్డే అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ షురూ అయ్యింది.
అయితే ఇది గతేడాది సమ్మర్‌లోనే జరిగింది. అప్పుడే పెద్ద దుమారం రేపింది. మళ్లీ ఇప్పుడు మరోసారి ఊపందుకుంది. సమంతపై పూజా హెగ్డే ఫ్యాన్స్ కామెంట్ చేయడంతో అది సమంత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పూజా అభిమానులపై విరుచుకుపడుతున్నారు.
దీనికి కారణమేంటనేది మూలాల్లోకి వెళితే, ఆ మధ్య పూజా హెగ్డే, సమంత పాత ఫోటోని పంచుకుంటూ `ఆమెలో ఎప్పుడూ అందాన్ని కనుగొనలేదు` అని పేర్కొంది. ఇది సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. అయితే ఆ వెంటనే పూజా స్పందిస్తూ, నా అకౌంట్ హ్యాక్ కి గురయ్యిందని, టెక్నికల్ టీమ్ దాన్ని సెట్ చేసే పనిలో ఉన్నారని, ఆ పోస్ట్ చేసింది తాను కాదని చెప్పింది.
`హాయ్ గాయ్స్.. నా ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ చేయబడింది. నా డిజిటల్ బృందం నాకు సహాయం చేస్తుంది. హ్యాక్ నుంచి కాపాడే ప్రయత్నం జరుగుతుంది. దయజేసి ఎవరూ ఎలాంటి పోస్ట్ లు పెట్టవద్దు, వ్యక్తిగతంగా పోస్టులు పెట్టుకోవద్దు` అని తెలిపింది. కానీ అభిమానులు ఆమె ఆన్‌స్టాలో పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసుకున్నారు.
కానీ ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమంతపై పూజా ఫ్యాన్స్ ఫైర్ అయితే, పూజా అభిమానులపై సమంత అభిమానులు ఫైర్ అవడం, కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే సమంతది ప్లాస్టిక్ అందం అంటూ కామెంట్ చేయడంతో నిప్పు మీద ఉప్పేసినట్టయ్యింది. వివాదం కాస్త పెద్ద యుద్ధంగా మారింది.
అసలు వారు ఎలాంటి పోస్ట్ లు పెట్టారనేది చూస్తే, `సమంత వర్కౌట్ చేస్తే ఆమె కాలరీలు కరుగుతాయా? లేక ప్లాస్టిక్ కరుగుతుందా? `అంటూ జస్ట్ ఆస్కింగ్, వి సపోర్ట్ పూజాహెగ్డే అనే యాష్ ట్యాగ్‌లను పంచుకున్నారు.
మరొకరు `ప్లాస్టిక్ సమంత వద్దకు వెళ్లకు పూజా, ఆమె చాలా వేడిగా ఉన్నారు. కాలిపోతారు` అంటూ వి సపోర్ట్ పూజా హెగ్డే అని పేర్కొన్నారు. మరికొందరు `సమంతది కేవలం ప్లాస్టిక్ అందం` అంటూ పేర్కొన్నారు. ఇవే దుమారానికి కారణమయ్యాయి. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత `సామ్‌జామ్`కి హోస్ట్ గా చేస్తుంది. త్వరలోనే ఇది పూర్తి కానుంది. దీంతోపాటు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న `శాకుంతలం` చిత్రంలో శకుంతలగా కనిపించబోతుంది.
మరోవైపు `అల వైకుంఠపురములో`, `మహర్షి`, `హౌజ్‌ఫుల్4` చిత్రాల విజయాలతో దూకుడు మీదుంది పూజా హెగ్డే. స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. బాలీవుడ్‌లోనూ పాగా వేస్తుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ప్రభాస్‌తో `రాధేశ్యామ్`, అఖిల్‌తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రాల్లో నటిస్తుంది. `సర్కస్` అనే ఓ హిందీ సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా నిలుస్తుందీ హాట్ భామ.