అంతేకాదు.. తాను రాజ్ నిడిమోరుతో విడిపోతున్నానంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. అందులో ఎలాంటి నిజం లేదని సమంత క్లారిటీ ఇచ్చింది. వోగ్ ఇండియాతో సమంత మాట్లాడుతూ.. ‘ నేను, నాగ చైతన్యతో విడిపోయినప్పుడు, నేను పూర్తిగా కుంగిపోయాను. ఆ సమయంలో మరొకరిని నమ్మే స్థితిలో నేను లేను. అసలు ఇక జీవితంలో ఇంకొకరిని నమ్ముతాను అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా అదృష్టం మారిపోయింది. అదృష్టవశాత్తు నాకు రాజ్ లాంటి వ్యక్తి దొరికాడు. ఇప్పుడు జీవితం బాగుంది. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయద్దు’ అని చెప్పారు.
రాజ్ నిర్మించిన , సమంత నటించిన "ది ఫ్యామిలీ మ్యాన్" సీజన్ 2 సెట్స్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. వారు డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు.సమంత కెరీర్ విషయానికి వస్తే... చివరగా సిటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇది అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. త్వరలోనే ఆమె నటించిన ‘ మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.