Samantha: మకాం ముంబైకి మార్చిన సమంత... మేనేజర్ ని తొలగించడం వెనుక ఇంత స్కెచ్ ఉందా!

Published : Apr 05, 2022, 08:26 PM IST

స్టార్ లేడీ సమంత ముంబైకి మకాం మార్చడం హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులుగా ఆమె అక్కడే ఉంటున్నారు. సమంత నిర్ణయం వెనుక పెద్ద ప్రణాళికే ఉన్నట్లు సమాచారం అందుతుంది.

PREV
17
Samantha: మకాం ముంబైకి మార్చిన సమంత... మేనేజర్ ని తొలగించడం వెనుక ఇంత స్కెచ్ ఉందా!


చెన్నైకి చెందిన సమంత నాగ చైతన్య(Naga Chaitanya)ను వివాహం చేసుకొని హైదరాబాద్ కోడలు అయ్యింది. దీంతో ఆమె పర్మినెంట్ గా హైదరాబాద్ లో ఉండిపోతారని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా నాగ చైతన్యతో ఆమె విడిపోయారు. విడాకులు తీసుకొని ఎవరికి వారయ్యారు.

27

సౌత్ ఇండియా స్టార్ గా ఎదిగిన సమంత (Samantha)అత్యధిక ఫ్యాన్ బేస్ టాలీవుడ్ లోనే సంపాదించారు. ఆమెకు ఎక్కువగా ఆఫర్స్ ఇక్కడే వస్తున్నాయి. దీంతో సమంత హైదరాబాద్ ని వీడరని అనుకున్నారు.అయితే విడాకుల తర్వాత సమంత థింకింగ్ మారిపోయింది. ఆమె బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.

37

గత ఏడాది సమంత నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2 భారీ సక్సెస్ సాధించింది. ఆ సిరీస్ నార్త్ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో ఆమెకు అక్కడ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఎప్పటి నుండో బాలీవుడ్ లో సెటిల్ కావాలనుకుంటున్న సమంత ఇదే అదనుగా భావించి.. ముంబై చెక్కేశారు.

47

ఈ క్రమంలో ఆమె మేనేజర్ ని కూడా మార్చేశారు. నాగ చైతన్య, సమంతలకు మేనేజర్ ఒకరే కాగా, విడాకుల తర్వాత కూడా ఆయననే కొనసాగించింది. ఇప్పుడు పూర్తిగా ముంబైకే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్న సమంత, దానిలో భాగంగానే మేనేజర్ ని మార్చేశారని సమాచారం.

57

అలాగే ముంబైలో ఖరీదైన ఓ ఇంటిని కొనుగోలు చేశారట. దాదాపు మూడు కోట్ల విలువ చేసే ఈ ఇంటి నిర్మాణం తుది దశలో ఉండగా.. పూర్తి కాగానే కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారట. ఇక సౌత్ లో ఒప్పుకున్న చిత్రాల షూటింగ్ కి సమంత ముంబై నుండే వచ్చి హాజరవుతున్నారు.

67

విడాకుల తర్వాత తన ఫోకస్ మొత్తం కెరీర్ పైనే పెట్టిన సమంత మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నారు. చాలా ఇండిపెండెంట్ గా ఉండే సమంత ఛాలెంజెస్ పేస్ చేయడానికి ఇష్టపడతారు. స్టార్ హీరోయిన్ పీక్స్ చూసిన సమంత... తన మిత్రులను, టాలీవుడ్ ని వదులుకొని ముంబై వెళ్లిపోయారు.

77

ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం చిత్రాలు చేస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతితో చేసిన ద్విభాషా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కొన్ని సిరీస్లకు ఆమె సైన్ చేశారు.

click me!

Recommended Stories