
సమంత.. ఇటీవల ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్యం రీత్యా తాను బ్రేక్ తీసుకుంటున్నట్టు చెప్పింది. దీంతో కోట్ల మంది అభిమానులను ఆందోళనకి గురయ్యారు. ఏడాది పాటు మిస్ అవుతామనే బాధ వారిలో వెంటాడింది. అయినా ఆమెకి సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెట్టారు. రెట్టింపు స్ట్రాంగ్‌గా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. సమంత నటించాల్సిన ప్రాజెక్ట్ లు(ఖుషి, సిటాడెల్) షూటింగ్ లు పూర్తి కావడంతో ఆమె ఇప్పుడే విశ్రాంతిలో ఉన్నారు.
సమంత ఇప్పుడు ప్రశాంతమైన లైఫ్‌ని అనుభవిస్తున్నారు. ఇంట్లో తన క్యాట్‌తో, పెట్ డాగ్ లతో సరదాగా గడుపుతున్నారు. మరోవైపు ఇషా ఫౌండేషన్‌లో ధాన్యం చేస్తున్నారు. పూర్తిగా ఆధ్యాత్మి సేవ వైపు ఆమె టర్న్ తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. రెండేళ్ల క్రితం సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే. దాన్నుంచి కోలుకుంది సమంత. కానీ దాని తాలుకూ ఎఫెక్ట్ ఇంకా ఉందట. తరచూ ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పూర్తిగా దాన్నుంచి బయటపడేందుకు మళ్లీ తనని మరింత బలంగా మార్చుకునేందుకు సామ్ ఈ బ్రేక్ తీసుకుంది.
అయితే ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చినా సమంత క్రేజ్ మాత్రం తగ్గడం లేదు సరికదా మరింత పెరుగుతుంది. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా నిలిచింది. క్రేజ్, పాపులారిటీ, సినిమాలు, ఫాలోయింగ్ ఇలా అన్ని యాంగిల్‌లో ప్రముఖ సెలబ్రిటీ రేటింగ్ సంస్థ ఓర్మాక్స్ ప్రకటించిన తాజా జాబితాలో సమంత నెంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు, సౌత్ లేడీ సూపర్ స్టార్స్ అందరిని వెనక్కి నెట్టి సమంత మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఎక్కువ మంది ప్రేమించి కథానాయికగా, మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ జాబితాలో సామ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకోవడం విశేషం.
సమంత ముందు దీపికా పదుకొనె, అలియాభట్, కియారా, నయనతార, త్రిష, రష్మిక మందన్నా, కత్రినా కైఫ్, కాజల్, కీర్తిసురేష్‌లు కూడా వెనకబడిపోవడం గమనార్హం. టాప్ 10 హీరోయిన్లలో సమంతది ఫస్ట్ ప్లేస్ కాగా, అలియా భట్ రెండో స్థానంలో, దీపికా పదుకొనె మూడో స్థానంలో, నయనతార నాలుగు, కాజల్ ఐదు, త్రిష ఆరు, కత్రినా ఏడు, కియారా ఎనిమిది, కీర్తిసురేష్ తొమ్మిది. కాగా నేషనల్ క్రష్ రష్మిక పదో స్థానంలో నిలవడం ఆశ్చర్యపరుస్తుంది. రకుల్, తమన్నా, అనుష్క, పూజా హెగ్డేలకు ఇందులో చోటు దక్కలేదు.
సమంతకి `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ ఇండియా వైడ్‌గా పాపులారిటీని తెచ్చిపెట్టింది. మూడేళ్ల క్రితం అది వచ్చినా, దాని ప్రభావం ఇప్పటికీ ఉంది. దీనికితోడు `యశోద`, `శాకుంతలం` వంటి పాన్ ఇండియా మూవీస్ చేసింది. అయితే అవి ఆదరణ పొందకపోయినా వాటి ఇంపాక్ట్ ఉంది. మరోవైపు `పుష్ప`లో ఐటెమ్ సాంగ్‌తో ఇండియానే ఊపేసింది. పెద్ద పెద్ద స్టార్స్ ఈ పాటలో సమంతని ఇమిటేట్ చేయడం విశేషం. ఈ పాట మాస్ లోకి బాగా వెళ్లింది. నార్త్ కి బాగా రీచ్ అయ్యింది. దీనికితోడు తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన విషయాలు ఆడియెన్స్ లో సింపతీని పెంచాయి. ఇవన్నీ ఆమెకి తిరుగులేని కథానాయికని, ఎక్కువ మంది ప్రేమించి నటిగా మార్చాయని చెప్పొచ్చు.
సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో `ఖుషి` సినిమా చేస్తుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కాఉనంది. దీంతోపాటు హిందీలో వరుణ్ దావన్‌తో `సిటాడెల్` వెబ్ సిరీస్ చేసింది. ఇది హాలీవుడ్ వెబ్ సిరీస్‌కి రీమేక్. రాజ్ డీకేలు రూపొందించారు. ఇది త్వరలో రాబోతుంది.