బర్త్ డే గర్ల్ సమంత సీడీపీ వైరల్‌..తెలుగులో చేసిన 8 బెస్ట్ మూవీస్‌ ఇవే..

First Published Apr 28, 2021, 9:40 AM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నేడు తన 34వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సామ్‌ బర్త్ డే సీడీపీ వైరల్‌గా మారింది. అదే సమయంలో సమంత తెలుగులో నటించిన బెస్ట్ చిత్రాలు ఎనిమిదిఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం. 

సమంత బుధవారం తన 34వ బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన బర్త్ డే సీడీపీ ట్రెండ్‌ అవుతుంది. ఇందులో సమంత కెరీర్‌, ఆమె చేస్తున్న సామాజిక కార్యక్రమాలు, ప్రత్యూష ఫౌండేషన్‌, చిన్నారులకు ఉచితంగా విద్యని అందించే ఏకం సంస్థలను చూపించారు. ప్రిన్సెస్‌ మాదిరిగా ఉన్న సమంత బర్త్ డే సీడీపీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
undefined
`ఏ మాయ చేసావె`, `ఈగ`, `మనం`, `మహానటి`, `రంగస్థలం`, `ఓ బేబీ`, `మజిలి`, `జాను` చిత్రాలు సమంత కెరీర్‌లో బెస్ట్ చిత్రాలుగా చెప్పుకోవచ్చు. నటిగా సమంత కెరీర్‌ని మరో మెట్టు ఎక్కించిన చిత్రాలివి. వాటి స్పెషాలిటీ ఏంటో ఓ సారి చూద్దాం.
undefined

Latest Videos


సమంత తెలుగులో కెరీర్‌ ప్రారంభమైంది `ఏ మాయ చేసావె` చిత్రంతోనే. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత..నాగచైతన్యతో కలిసి నటించింది. ఇందులో సమంత `జెస్సీ`గా అదరగొట్టింది. నస్కీ వాయిస్‌, ఆమె నటన, హవభావాలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. సినిమా సక్సెస్‌లో ఆమెదే ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచే చైతూ ప్రేమలో పడింది. వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా సమంత లైఫ్‌ నే మార్చేసిన చిత్రమిది.
undefined
ఆ తర్వాత సామ్‌ `బృందావనం`, `దూకుడు` చిత్రాలతో కమర్షియల్‌ హిట్స్ అందుకున్నప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో చేసిన `ఈగ` తన కెరీర్‌లో స్పెషల్‌ ఫిల్మ్ గా నిలిచింది. ది బెస్ట్ ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు. ఇందులో ఆమె ఈగతో రొమాన్స్, విలన్‌ పాత్ర అయిన సుదీప్‌ని హేట్‌ చేసే క్రమంలో ఆమె నటన అద్భుతమని చెప్పాలి. నాని హీరోగా నటించిన ఈ సినిమా సమంత కెరీర్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లింది.
undefined
`మనం`.. అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన చిత్రమిది. యాదృశ్చికమో ఏమో గానీ ఇందులో సామ్‌.. చైతూకి భార్యగా నటించింది. ఆ తర్వాత వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అక్కినేని మూడు తరాల హీరోలు ఏఎన్నార్‌, నాగార్జున, చైతూ కలిసి నటించిన చిత్రం కావడం దీని మరో స్పెషాలిటీ. అంతేకాదు టాలీవుడ్‌ క్లాసిక్స్ లో ఈ సినిమా నిలిచిపోతుంది. దీనికి విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు.
undefined
`రంగస్థలం`లో రామలక్ష్మి పాత్ర హైలైట్‌. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా సమంత అదరగొట్టింది. ఆడియెన్స్ చేత ప్రశంసలందుకుంది. ఇందులో రామ్‌చరణ్‌ సరసన నటించగా, సుకుమార్‌ దర్శకత్వం వహించారు. ఇది కలెక్షన్ల పరంగానూ సంచలనం క్రియేట్‌ చేసింది. సమంత పల్లెటూరి అమ్మాయిగా కనిపించడం ఇదే తొలిసారి.
undefined
ఆ తర్వాత అనేక కమర్షియల్‌ సినిమాల్లో నటించింది సామ్‌. కానీ `మహానటి` మాత్రం ఆమెకి స్సెషల్‌ ఫిల్మ్ గా బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తిసురేష్‌ నటించగా, ఆమెకి పారలల్‌గా సమంత..సైతం మధురవాణి పాత్రలో జర్నలిస్ట్ గా అద్భుతంగా చేసింది. ఆడియెన్స్ చేత కన్నీళ్లు పెట్టించింది. ఇందులో విజయ్‌ దేవరకొండతో ఆమె కెమిస్ట్రీ బాగా పండింది.
undefined
చైతూతో చేసిన మరో సినిమా `మజిలి` సమంత కెరీర్‌లో బెస్ట్ చిత్రాల్లో ఒక్కటిగా నిలుస్తుంది. ఇందులో పెళ్లైన సామాన్య గృహిణిగా ఫిదా చేసింది. చాలా మెచ్యూర్డ్ నటనని ప్రదర్శించి ప్రేక్షకుల చేత క్లాప్స్ కొట్టించింది. ఇందులో సామ్‌ ఎంట్రీ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. శివ నిర్వణ దీనికి దర్శకత్వం వహించారు.
undefined
సమంత కెరీర్‌లో మరో స్పెషల్‌ ఫిల్మ్ `ఓ బేబీ`. కొరియన్‌ చిత్రానికి రీమేక్‌. నందిని రెడ్డి రూపొందించారు. ఇందులో యంగ్‌ ఉమెన్‌గా, వృధ్ధురాలిగా సమంత నటించింది. స్టార్‌ హీరోయిన్‌గా చేస్తున్న సమంత ఈ సినిమా చేయడం ఓ సాహసమనే చెప్పాలి. అంతే అద్భుతంగా చేసి మెప్పించింది. ఇందులో వృద్ధురాలి వాయిస్‌లో వాహ్‌ అనిపించింది.
undefined
సమంత చివరగా నటించిన `జాను` ది బెస్ట్ సినిమాగానే ఉంటుంది. ఇది థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ మంచి ప్రశంసలందుకుంది. శర్వానంద్‌, సమంత సెటిల్డ్ పర్‌ఫెర్మెన్స్ తో ఆడియెన్స్ ఆకట్టుకున్నారు. ఇది తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన `96`కి రీమేక్‌. మాతృక దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ దీన్ని రూపొందించారు.
undefined
సమంత తెలుగులో చేసిన ఎనిమిది బెస్ట్ చిత్రాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆమె బర్త్ డేని పురస్కరించుకుని వైరల్‌ చేస్తున్నారు సామ్‌ ఫ్యాన్స్. ప్రస్తుతం సమంత గుణశేఖర్‌ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. సమంత చేస్తున్న తొలి పౌరాణిక చిత్రమిది. ఇందులో శకుంతలగా ఆమె కనిపించబోతున్నారు.
undefined
click me!