బ్యూటీఫుల్ శారీలో సమంత మెరుపులు.. చీరకట్టులో సామ్ స్టన్నింగ్ స్టిల్స్..

First Published | Oct 26, 2023, 3:20 PM IST

స్టార్ హీరోయిన్ సమంత బ్యూటీఫుల్ శారీలో కట్టిపడేస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్న స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో మాత్రం కనిపిస్తోంది. వరుస పోస్టులతో ఆకట్టుకుంటోంది. తాజాగా చీరకట్టులో మెరిసింది. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)  ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. తన హెల్త్ విషయంలో పూర్తిగా శ్రద్ధ వహించేందుకు ఏడాదిపాటు బ్రేక్ ఇచ్చారు. కానీ సోషల్ మీడియాలోనూ మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటున్నారు.
 

ఇక పబ్లిక్ అపియరెన్స్ తోనూ ఖుషీ చేస్తోంది. మయోసైటిస్ కు గురైన సామ్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ముంబైలో చాలా యాక్టివ్ గా స్టైలిష్ లుక్ లో కనిపించారు. సామ్ అంత ఎనర్జిటిక్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 


ఇక సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చినా పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేసేందుకు ఫొటోషూట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తన కో-ఫౌండర్ గా ఉన్న ఫ్యాషన్ కంపెనీ Saaki కోసం బ్యూటీఫుల్ గా ఫొటోషూట్ చేసింది. చీరకట్టి మెస్మరైజ్ చేసింది.

బ్యూటీఫుల్ డిజైన్డ్ శారీలో మెరిసింది. తన క్లాథ్స్ ను ప్రమోట్ చేసుకునేందుకు ఇలా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఖతర్నాక్ ఫోజులతో మైమరిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. 

సమంత నెట్టింట మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తోంది. తన గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తోంది. తన వ్యక్తిగత విషయాలను నిర్మోహమాటంగా పంచుకుంటూ ఫ్యాన్స్ కు మరింత టచ్ లో ఉంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది.
 

సమంత చివరిగా ‘ఖుషి’ చిత్రంలో విజయ్ దేవరకొండ నటించింది. ఈ మూవీ ప్రేక్షకుల నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను అందుకుంది. సామ్ లైనప్ లోని క్రేజీ ప్రాజెక్ట్ ‘సిటడెల్’ సిరీస్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సామ్ మున్ముందు చేయబోయే ప్రాజెక్ట్స్ పైనా అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!