చిరంజీవి కోసం పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న సల్మాన్‌.. అసలు విషయం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే ?

Published : Mar 25, 2022, 06:41 PM ISTUpdated : Mar 26, 2022, 10:10 AM IST

చిరంజీవి నుంచి వస్తోన్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ `గాడ్‌ ఫాదర్‌`. ఇందులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఆయన పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నట్టు  తెలుస్తుంది. అందుకు కారణాలు ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. 

PREV
17
చిరంజీవి కోసం పారితోషికం తీసుకోకుండా నటిస్తున్న సల్మాన్‌.. అసలు విషయం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే ?
god father movie

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చాలా కాలం తర్వాత నటిస్తున్న మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ `గాడ్‌ ఫాదర్‌`(God Father). ఈ సినిమా మాలయాళంలో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం `లూసిఫర్‌`కు రీమేక్‌. తెలుగులో దీన్ని `గాడ్ ఫాదర్` పేరుతో దర్శకుడు మోహన్‌రాజా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో మెరవనున్నారు. తాజాగా సల్లూ భాయ్‌కు సంబంధించిన షూటింగ్ కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మోహన్ రాజా స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

27
god father movie

ఈ మేరకు సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫోటోలను పంచుకున్నారు దర్శకుడు మోహన్‌రాజా. `సల్మాన్‌ ఖాన్‌తో అద్భుతమైన షెడ్యూల్ పూర్తయింది. ఇండియన్ మోస్ట్ ఫేవరెట్ భాయ్‌తో మధురక్షణాలు మిగిలాయి. సల్మాన్‌కు ధన్యవాదాలు. ఇందుకు కారణమైన చిరంజీవికి థ్యాంక్స్` అని పేర్కొన్నారు మోహన్‌రాజా. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌.. మాతృక `లూసీఫర్‌`లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన పాత్రని చేయబోతున్నట్టు తెలుస్తుంది. 

37
god father movie

మాతృకలో మోహన్‌లాల్‌ రాజకీయాలను శాషించే పెద్ద మాఫియా డాన్‌(నాయకుడు) తరహా పాత్రలో కనిపిస్తారు. ఆయనకు బాగా దగ్గరైన, తన శిష్యుడి లాంటి నాయకుడి పాత్రలో పృథ్వీరాజ్‌ నటించారు. మోహన్‌లాల్‌కి ఆపద వచ్చినప్పుడు పృథ్వీరాజ్‌ వస్తాడు. అలా చిరంజీవికి ఆపద ఎదురైన సమయంలో సల్మాన్‌ ఖాన్‌ పాత్ర రాబోతుందని చెప్పొచ్చు. అయితే సల్మాన్‌ పాత్రని బాగా పెంచారని, ఎక్స్ టెండెడ్‌ కోమియోగా మార్చారని తెలుస్తుంది. చిరు, సల్మాన్‌ కాంబినేషన్‌లో ఓ పాట కూడా ఉండబోతుందని టాక్‌.

47
god father movie

ఇక ఈ చిత్రంలో సల్మాన్‌.. చిరంజీవి కోసం నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. చిరంజీవి అడగ్గా, ఆయనపై గౌరవంతో ఈ పాత్రని చేస్తున్నట్టు, అందుకు పారితోషికం కూడా తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఈ వార్త  హాట్‌ టాపిక్‌గానూ మారింది. మరోవైపు `గాడ్‌ ఫాదర్‌` చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు చిరంజీవి. ఇటీవల తెలుగు సినిమాలు హిందీలో బాగా ఆడుతున్నాయి. మంచి కలెక్షన్లని వసూలు చేస్తున్నాయి. దీంతో బాలీవుడ్‌ మార్కెట్‌ టార్గెట్‌గా సల్మాన్‌ని దించుతున్నారని ఇంటర్నెట్‌ టాక్‌. 

57
god father movie

 `గాడ్‌ ఫాదర్‌` చిత్రం కోసం సల్మాన్‌ పారితోషికం తీసుకోకపోవడానికి కారణం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా కాలంగా మెగా ఫ్యామిలీతో సల్మాన్‌కి వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్ ఉన్నాయట. రామ్‌చరణ్‌తోనూ ఆ రిలేషన్‌ ఉందని తెలుస్తుంది. రామ్‌చరణ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తూ నటించిన `జంజీర్‌` సమయంలో సల్మాన్‌ సపోర్ట్ చేశారని టాక్. అలాగే సల్మాన్‌ నటించిన `దబాంగ్‌ 3` చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేసినప్పుడు రామ్‌చరణ్‌ సపోర్ట్ చేశారు. హైదరాబాద్‌ ఈవెంట్‌కి ఆయన గెస్ట్ గా వెళ్లారు. ఈ రిలేషన్‌ కారణంగా పారితోషికం తీసుకోకుండా సల్లూ భాయ్‌ ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. 

67
god father movie

దీంతోపాటు మరో ఇంట్రెస్టింగ్‌ విషయం కూడా వినిపిస్తుంది. చరణ్‌కి, సల్మాన్‌కి మధ్య వ్యాపారపరమైన సంబంధాలు కూడా ఉన్నాయని టాక్. ఈ కారణంగానే సల్మాన్‌ `గాడ్‌ ఫాదర్‌`లో నటించేందుకు ఒప్పుకున్నారని భోగట్టా. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ చిరంజీవిపై గౌరవంతో సల్మాన్‌ ఈ సినిమా చేస్తున్నారనే వార్తతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. సల్మాన్‌ గొప్ప మనసుకి ఫిదా అవుతున్నారు. రామ్‌చరణ్‌ ఓ విమాన కంపెనీలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

77
god father movie

ఇక `గాడ్‌ ఫాదర్‌` చిత్రంలో చిరంజీవి, సల్మాన్‌ తోపాటు నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ఇప్పటికే 60 శాతం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. ముంబయి షెడ్యూల్‌లో సల్మాన్‌ పాల్గొన్నారు.  మరోవైపు ఈ సినిమాని తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీలోనూ విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.  ఈ ఏడాది చివర్లోనే సినిమాని రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories