బబుల్ గమ్ మూవీతో రోషన్ ని హీరోగా పరిచయం చేసింది సుమ కనకాల. బబుల్ గమ్ డిసెంబర్ 27న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. బబుల్ గమ్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రోషన్ యాక్టింగ్ ఓకే, బట్ కథ అంతగా రీచ్ కాలేదని అంటున్నారు.
26
Anchor Suma Kanakala
మూవీ విడుదలై రెండు వారాలు కావస్తుంది. అంతగా రెస్పాన్స్ రాలేదు. బబుల్ గమ్ ప్లాప్ ఖాతాలో చేరింది. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా యాంకర్ సుమ ట్రై చేస్తుంది . . ఇంకా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది .
36
Anchor Suma Kanakala
తాజాగా బబుల్ గమ్ టైటిల్ తో కూడిన అవుట్ ఫిట్ ధరించింది. నెట్ టీ షర్ట్ ధరించిన సుమ ఒక ట్రెండీ ఫోటో షూట్ చేసింది. గతంలో ఎన్నడూ సుమ ఇలా గ్లామరస్ ఫోటో షూట్ చేసింది లేదు. కానీ కొడుకుకు కోసం ఇలా తయారైంది.
46
Anchor Suma Kanakala
ఇంకా ఎంత ప్రమోట్ చేసినా సినిమా లేచే మార్గం లేదు. అరకొరా వసూళ్లు తప్పితే భారీ వసూళ్లు దక్కడం జరగని పని. కానీ కొడుకు భవిష్యత్ గురించి సుమ దారుణ ఫోటో షూట్స్ చేస్తుంది. బబుల్ గమ్ నిర్మాత సుమనే అని సమాచారం. నష్టాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలనుకుంటుందేమో..
56
Bubble Gum Trailer launch event
ఇక బబుల్ గమ్ మూవీ విషయానికి వస్తే... బోల్డ్ కంటెంట్ తో మూవీ తెరకెక్కింది. ముద్దు సీన్స్ తో రోషన్ రచ్చ చేశాడు. హీరోయిన్ మానస చౌదరి తో లెక్కకు మించిన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ట్రైలర్ చూసిన రాఘవేంద్రరావు ఎన్ని ముద్దు సీన్స్ ఉంటే అంత హిట్ అన్నాడు.
66
కంటెంట్ లేకుండా పెట్టిన కిస్సులు వేస్ట్ అయ్యాయి. మొత్తంగా సినిమాకు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. సుమ వద్ద కోట్లు ఉన్నాయి. కొడుకుతో మరో సినిమా చేయడం ఖాయం. ఈసారి ఇలాంటి సబ్జెక్టు ఎంచుకుంటుందో చూడాలి...