Sai Pallavi: తన వ్యాఖ్యల వివాదంపై సాయిపల్లవి మరోసారి క్లారిటీ.. కొందరు రాజకీయంగా వాడుకున్నారంటూ కామెంట్‌

Published : Jul 11, 2022, 03:51 PM ISTUpdated : Jul 11, 2022, 04:31 PM IST

తన వ్యాఖ్యలను రాజకీయంగా వాడుకున్నారు. తాను ఎక్కడా తప్పు మాట్లాడలేదని, పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించానని తెలిపింది సాయిపల్లవి. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన నేపథ్యంలో మరోసారి రియాక్ట్ అయ్యింది.   

PREV
15
Sai Pallavi: తన వ్యాఖ్యల వివాదంపై సాయిపల్లవి మరోసారి క్లారిటీ.. కొందరు రాజకీయంగా వాడుకున్నారంటూ కామెంట్‌

సాయిపల్లవి ఇటీవల `విరాటపర్వం` చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా ఆదరణ పొందలేకపోయింది. ఆటైమ్‌లో సాయిపల్లవి ప్రమోషన్‌లో భాగంగా `కాశ్మీర్‌ ఫైల్స్` గురించి, మనుషుల హత్యలను, గోహత్యలకి సంబంధించిన ఎదురైన ప్రశ్నకి ఆమె స్పందించారు. మనుషుల హత్యలు చేస్తున్నారని, మనిషి ప్రాణాలు విలువైనవని తెలిపారు. గోహత్యలను, మనుషుల హత్యలకు పోలిక పెట్టడంపై పలువురు రాజకీయ నాయకులు, కొన్ని మత సంస్థలు వ్యతిరేకించాయి. దీంతో ఇది వివాదంగా మారింది. మరోవైపు దీనిపై సాయిపల్లవి వేసిన పిటిషన్‌ కూడా కోర్ట్ కొట్టేసింది. 

25

తాజాగా దీనిపై సాయిపల్లవి స్పందించింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన `గార్గి` చిత్రం ఈ నెల 15న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి సోమవారం మీడియాతో ముచ్చటించింది. ఆఆ వివాదంపై మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 
 

35

తన మాటలను వక్రీకరించారని తెలిపింది. ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు తనకున్న వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పానని, తాను చెప్పిన పూర్తి ఇంటర్వ్యూ వీడియోని చూడకుండా వారికి కావాల్సింది తీసుకుని తన మాటలను వక్రీకరించారని తెలిపింది. తాను ఏం మాట్లాడింది, ఏ ఉద్దేశంతో మాట్లాడిందనేది అందరకి తెలుసని, కొందరు తమ రాజకీయాలకు తన వ్యాఖ్యలను వాడుకుని వివాదం చేశారని ఆరోపించారు. 
 

45

ఈ విషయంలో తాను భయపడటం లేదని, తన మాటలకు కట్టుబడి ఉన్నానని, అది పెద్ద వివాదం కాదని తెలిపింది. నిజం ఏంటనేది అందరికి తెలుసని, రూమర్‌ కొన్ని రోజులు ఉండి తర్వాత కనుమరుగవుతుందని, తన పిటిషన్‌ కోర్ట్ కొట్టివేయడం కూడా పెద్ద విషయం కాదని తెలిపింది. ప్రస్తుతం తాను హ్యాపీగానే, సేఫ్‌గానే ఉన్నట్టు తెలిపింది. 

55

ఇదిలా ఉంటే `గార్గి` చిత్రం గురించి చెబుతూ, ఇదొక తండ్రి కోసం కూతురు చేసే న్యాయపోరాటమని పేర్కొంది. ఒక టీచర్‌ ఎమోషనల్‌ జర్నీ అని, రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు రాసుకున్నారని తెలిపింది. బలమైన పాత్రలో నటించానని చెప్పింది. కమర్షియల్‌గానూ ఆకట్టుకునే చిత్రమవుతుందని పేర్కొంది. ఈ సినిమా నచ్చి హీరో సూర్య,జ్యోతిక సమర్పకులుగా వ్యవహరించారని, ఉదయనిధి స్టాలిన్‌ కూడా సపోర్ట్ చేస్తున్నారని పేర్కొంది. తెలుగులో రానా సమర్పకులుగా వ్యవహరిస్తున్నారని చెప్పింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories