అల్లు అర్జున్ గురించి మనసులో మాట బయట పెట్టిన సాయి పల్లవి..? మహేష్ గురించి ఏమన్నదంటే..?

Published : Oct 18, 2022, 10:18 AM IST

అల్లు అర్జున్ పై తన మనసులో మాట బయట పెట్టింది.  ఫిదా బ్యూటీ సాయి పల్లవి.  గతంలో స్టార్ హీరోల సినిమాలు రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. ఈసారి బన్నీతో పాటు.. మహేష్ పై కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడింది. 

PREV
17
అల్లు అర్జున్ గురించి మనసులో మాట బయట పెట్టిన సాయి పల్లవి..? మహేష్  గురించి ఏమన్నదంటే..?

హీరోయిన్లంతా ఒక ఎత్తు అయితే.. సాయి పల్లవి ఒక ఎత్తు. ఆమె సినిమాల ఎంపిక డిఫరెంట్ గా ఉంటుంది. అందరు హీరోయిన్ల లా గోల్డెన్ ఆఫర్ వచ్చింది. చేసేద్దాం అని ఆలోచించదు సాయి పల్లవి. ఆ సినిమాలో హీరోయిన్ కు మంచి పాత్ర ఉండాలి.. మంచి డైలాగ్స్ ఉండాలి.. హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉండాలి. అలా ఉంటేనే సినిమా చేస్తుంది సాయి. 

27
Sai Pallavi

ఇలా ఆలోచించే చాలా మంది స్టార్ల దగ్గర హీరోయిన్ గా చేసే అవకాశం  తానంతట తాను వదిలేసుకుంది సాయి పల్లవి.  అంతే కాదు అనిల్ రావిపూడి స్వయంగా వెళ్ళి అడిగినా మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాను రిజెక్ట్ చేసిందంటూ.. ఇండస్ట్రీలో అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.  హీరోయిన్ ఉండి ఉండనట్టు సినిమాలో ఉండకూడదు.. హీరోయిన్ పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉండాలి అని కోరకుంటుంది సాయి పల్లవి. 

37

నేను స్టార్ హీరోతోనే సినిమా చేయాలి అని అనుకోను.. నా దృష్టిలో హీరో ఇంపార్టెంట్ కాదు ..కథ నచ్చితే ఎవరితో అయినా చేస్తాను.. అది స్టార్ హీరో అని కాదు కమెడియన్ అయినా సరే ఎవరితో అయినా చేస్తాను అన్నదట హీరోయిన్.  అంతేకాదు ఇంస్ట్రీలో తనకు అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం అంటోంది సాయి పల్లవి. 

47

అల్లు అర్జున్ డాన్స్ లో ఏదో తెలయని మాయ ఉంటుంది. ఆయన డాన్స్ చేస్తుంటే అలానే చూడాలి అనిపిస్తుదంటు హాట్ కామెంట్స్ చేసింద సాయి పల్లవి. తను డాన్సర్ కావడంతో ఇండస్ట్రీలో డాన్సింగ్ స్టార్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులోను బన్నీ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. అంతే కాదు తాను బాలీవుడ్ లో మాధురీ దీక్షిత్ డాన్స్ చూస్తూ.. తను కూూడా డాన్సర్ అవ్వాలని ఇన్స్ పైర్ అయ్యానంటోంది. 

57
Sai Pallavi

ఇక  వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న సాయిపల్లవి.. రీసెంట్ గా గార్గి సినిమాతో ఓ ఫెయిల్యూర్ ను ఫేస్ చేసింది. అయితే ఈసినిమాలో ఆమె పెర్ఫామెన్స్ కు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది సాయి. 

67

ఇక సాయి పల్లవి అప్పట్లో మహేష్ బాబు సినిమాను వదిలేసుకుని సంచలనం సృష్టించింది. ఇక ఇన్నాళ్లకు మరోసారి మహేష్ గురించి  కూడా మాట్లాడిందట సాయి. మహేష్ బాబు స్క్రీన్ ప్రజెంట్ చాలా నచ్చుతుందని ఆయన సింప్లిసిటీ అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అంతేకాదు మహేష్ బాబును చూశాక మగాళ్లు ఇంత అందంగా ఉంటారా అని కూడా నాకు అనిపించిందని అంటోంది సాయిపల్లవి. ఈ విషయంలో సాయి పల్లవిపై కాస్త నెగెటీవ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.  

77

అయితే సాయి పల్లవిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. నువ్వు ఏమైనా పెద్ద ఫిగర్ అనుకుంటున్నావా..?  మహేష్ అందంగురించి మాట్లాడే అర్హత నీకు లేదు అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో జరిగింది మనసులో పెట్టుకున్నారో ఏమో.. సాయి పల్లవిని ఆడేసుకుంటున్నారు నెటిజన్లు.
 

 

Read more Photos on
click me!

Recommended Stories