రానాకు ఫోన్ చేసి హెల్ఫ్ అడిగిన సాయి పల్లవి..? ఇంతకీ రానా ఏమన్నాడంటే..?

Published : Jul 12, 2022, 10:39 AM IST

రానాకు సాయి పల్లవి ఫోన్ చేసిందట. అవును రానాకు ఫోన్ చేసి ఓ హెల్ప్ కావాలి అని అడిగిందట.. దానికి రానా ఏమన్నాడో తెలుసా..? ఇంతకీ సాయి పల్లవి అడిగిన హెల్ప్ ఏంటీ..?   

PREV
17
రానాకు ఫోన్ చేసి హెల్ఫ్ అడిగిన సాయి పల్లవి..? ఇంతకీ రానా ఏమన్నాడంటే..?
SaiPallavi

సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది సాయి పల్లవి. స్టార్ హీరో ఉన్నాడు కదా అని కళ్ళుమూసుకుని సినిమాకు సైన్ చేసే అలవాటు లేదు ఆమెకు. కథలో తన పాత్ర ఇంపార్టెన్స్ ను బట్టే సినిమాలు ఒప్పుకుంటుంది. 

27

ఇక ఇప్పటి వరకూ అలాంటి సినిమాలే చేస్తూ వచ్చింది సాయి పల్లవి. హీరోయిన్ గా తన రోల్ అద్భుతంగా పండించగల శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం లాంటి సినిమాలతో తన ఇమేజ్ మరో రేంజ్ కు వెళ్లిపోయింది. ఇక త్వరలో గార్గి సినిమాతో మరోసారి ఆడియన్స్ ను పలకరించబోతుంది బ్యూటీ. 
 

37

సాయిపల్లవి లీడ్ రోల్ లో నటించిన సినిమా గార్గి. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ నెల 15వ తేదీన రిలీజ్ కాబోతోంది. తండ్రీకూతుళ్ల ఎమోషన్స్  ప్రధానంగా నడిచే కథ ఇది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ లో సాయిపల్లవి బిజీగా ఉన్నారు. 

47

ఈ విషయంలో సాయి పల్లవి టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి హెల్ప్ అడిగార. స్వయంగా రానాకు ఫోన్ చేసిన సాయి పల్లవి రానాకు ఈ మూవీ గురించి వివరంగా చెప్పి.. సపోర్ట్ చేయమి అడిగారట. ఇంతకీ సాయి పల్లవి ఏమన్నారంటే..? 

57
Saipallavi new look

 సాయి పల్లవి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఏదైనా మంచి పని చేస్తే అమ్మానాన్నలకు చూపించడానికి ఉత్సాహాన్ని చూపిస్తాము. అలా తమిళంలో చేసిన ఈ సినిమాను మీకు చూపించడానికి టాలీవుడ్ కు వచ్చాను అన్నారు. అంతే కాదు . తమిళంలో సూర్య, ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను చూసి.. మిగతా  భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేయమని సలహా ఇచ్చినట్టు తెలిపారు సాయిపల్లవి.  

67

నేను రానా గారికి కాల్ చేసి ఈ సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తారా? అని అడిగాను.  రాని ఆయన పాజిటీవ్ గా స్పందిస్తూ..నువ్వు ఒక సినిమా చేశావంటేనే .. ఆ సినిమాలో విషయం ఉంటుందనే సంగతి నాకు తెలుసు. ఈ సినిమా పరంగా ఎలాంటి  సపోర్ట్ కావాలన్నా చేస్తాను అన్నారు. అంటూ సాయి పల్లవి తెలిపారు. 

77

అంతే కాదు రానా చేసిన సపోర్ట్ కు స్పెషల్ గా మరీ మరీ   ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ.. సాయి పల్లవి  చెప్పుకొచ్చింది. మరి గార్గి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకూ ఆధరిస్తారో చూడాలి మరి. 

Read more Photos on
click me!

Recommended Stories