సాయిపల్లవి ఇప్పుడు ఫుల్ క్రేజ్‌లో ఉంది. ఈ అమ్మడు నటించిన `లవ్ స్టోరి` చిత్రంలోని `సారంగ దరియా` పాట సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. మరోవైపు `విరాటపర్వం`లోని ఆమె పాత్ర సైతం గూస్‌బమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇందులో విప్లవ నాయకుడు రానా భావాలకు ఆకర్షితురాలై, ఆయనబాటలో నడిచే ఉద్యమకారురాలు వెన్నెలగా కనిపించబోతుంది.
ఇదిలా ఉంటే సాయిపల్లవికి సంబంధించిన ఓ క్రేజీ వార్త వినిపిస్తుంది. ఆమె బాలకృష్ణ చిత్రంలో నటించబోతుంది. అంతేకాదు బాలకృష్ణకే చెల్లిగా కనిపించనుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది.
ఓ యంగ్ డైరెక్టర్ తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో ఓ కథని బాలకృష్ణకి వినిపించారని, లైన్ విన్న బాలయ్య మరో మాట లేకుండా ఓకే చెప్పేశాడని తెలుస్తుంది. ఇందులో కూతురు పాత్ర కోసం సాయిపల్లవిని అడుగుతున్నారట. `దృశ్యం` తరహాలో ఈ సినిమా కథ సాగుతుందని టాక్.
మరి హీరోయిన్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సాయిపల్లవి, బాలకృష్ణ లాంటి హీరో సినిమాకి ఓకే చెబుతుందా? పైగా కూతురుగా నటిస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ విషయం తెలిసి సాయిపల్లవి అభిమానులు షాక్ అవుతున్నారట. అదే సమయంలో బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `బీబీ3`(వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలోనే పూర్తి కానుంది.మే 30న విడుదల కానుంది. మరోవైపు ఇటీవల `క్రాక్` చిత్రంతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఇది పట్టాలెక్కబోతుంది. ఈ దర్శకుడితో కాకుండా మరో డైరెక్షన్‌లో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అందులోనే సాయిపల్లవి నటించనుందని టాక్.
సాయిపల్లవి ప్రస్తుతం `లవ్‌స్టోరి`, `విరాటపర్వం`తోపాటు నానితో `శ్యామ్ సింగరాయ్` చిత్రాల్లో నటిస్తుంది. పవన్ కళ్యాణ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లోనూ ఆమె పేరువినిపించింది. కానీ నో చెప్పిందని టాక్.