మోసగాళ్లు ప్రీమియర్ షో రివ్యూ: 50 కోట్ల బడ్జెట్ వర్కౌట్ అయిందా..?

First Published Mar 19, 2021, 7:59 AM IST

50 కోట్ల భారీ బడ్జెట్ తో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ వంటి స్టార్ స్టడ్డెడ్ కాస్ట్ తో పాన్ ఇండియా చిత్రంగా రూపొందించబడిన ఈ చిత్రం నేడు విడుదలై మనముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో చూద్దాము

దూసుకెళ్తా తరువాత హిట్ దొరక్క అలమటిస్తున్న హీరో మంచు విష్ణు నేడు మోసగాళ్లు సినిమా తో మనముందుకు వచ్చారు. 50 కోట్ల భారీ బడ్జెట్ తో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ వంటి స్టార్ స్టడ్డెడ్ కాస్ట్ తో పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని సొంతగా నిర్మించాడు విష్ణు. ఈ సినిమాకి హాలీవుడ్ దర్శకుడుజెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించాడు. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకదాన్ని చేధించే కథాంశంతో రూపొందించబడిన ఈ చిత్రం నేడు విడుదలై మనముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో చూద్దాము.
undefined
సినిమా కథ విషయానికి వస్తే ముంబై బస్తీల్లో ఉండే బ్రదర్ అండ్ సిస్టర్ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అమెరికాలోని తెల్లవాళ్ళ దగ్గరైతే డబ్బు బాగా ఉంటుంది కాబట్టి వారిని మోసం చేసినా తప్పులేదు అని భావించి వారి వద్ద నుండి 4000కోట్లను కొల్లగొడతారు. ఈ స్కాం నుంచి వారిద్దరూ బయటపడ్డారా లేదా, బయటపడితే ఎలా ఎస్కేప్ అయ్యారు అనేది కథాంశం.
undefined
ఇక సినిమా విషయానికి వస్తే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచేది మంచు విష్ణు కాజల్ ల యాక్టింగ్. బ్రదర్ అండ్ సిస్టర్ గా వీరిరువురు చేసిన యాక్షన్ సినిమా ఆద్యంతం మనల్ని ఆకట్టుకుంటుంది. నవీన్ చంద్ర, నవదీప్, పోలీస్ ఆఫీసర్ పాత్రలో సునీల్ శెట్టి ఇరగదీశారని చెప్పవచ్చు. సినిమా అంతా కూడా ఏదో కమర్షియల్ సినిమాలా కాకుండా రియలిస్టిక్ గా నడుస్తుంటుంది.
undefined
ఇక దర్శకుడుజెఫ్రీ గీ చిన్ విషయానికి వస్తే... సినిమాని హాలీవుడ్ రేంజ్ లోనే తీసాడని చెప్పవచ్చు. విజువల్స్, షాట్స్ అన్ని కూడా చాలా క్లాసీగా, రిచ్ గా ఉన్నాయి. సీరియస్ నోట్ లో ఇంటెన్స్ గా హీరో విష్ణు పాత్రను మలిచి ప్రేక్షకులకు చూపెట్టగలిగాడు దర్శకుడు. సినిమా మొత్తానికి క్లైమాక్స్ ప్రాణం అని చెప్పవచ్చు. క్లైమాక్స్ చూసి బయటకు వచ్చిన తరువాత క్లైమాక్స్ గురించి ఒక్కసారైనా చర్చ పెట్టడం తథ్యం.వెంకటేష్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.
undefined
పాన్ ఇండియా చిత్రం తీస్తుండడంతో... అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఇంటెన్షన్ తోనో ఏమోగాని మంచు విష్ణు ... తెలుగు నేటివిటీని పూర్తిగా గాలికొదిలేసినట్టుగా కనబడింది. సినిమాలోని పాటలు కూడా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. సినిమా మొత్తం క్లైమాక్స్ కోసమే రూపొందించినట్టుగా ఉంది. దర్శకుడు హాలీవుడ్ వాడు అవడం వల్ల చిత్రం రిచ్ గా ఉన్నప్పటికీ... మన తెలుగు సినిమాల్లో మనం రెగ్యులర్ గా చూసే నేటివ్ ఎలెమెంట్స్ పెద్దగా కనబడవు.
undefined
ఇక ఓవరాల్ గా చూసుకుంటే... మూడు ఫైట్స్, ఆరు పాటల కమర్షియల్ సినిమాగా కాకుండా ఒక కొత్త అనుభూతి మాత్రం ఈ చిత్రంలో దక్కడం తథ్యం. కాజల్ లాంటి హీరోయిన్ ని హీరోకి సోదరి పాత్రలో నటింపజేశారంటేనే సినిమా కథనం ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రొటీన్ కి భిన్నంగా ఉంటూ ఆద్యంతం సస్పెన్స్ తో , అందుకు తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పవచ్చు.
undefined
click me!