తనని కాపాడిన వ్యక్తి కోసం సాయి ధరమ్ తేజ్ ఏం చేశాడో తెలుసా.. డబ్బుతో వెలకట్టలేక..

Published : Apr 20, 2023, 03:49 PM IST

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. 90 దశకం వరకు పలు గ్రామాల్లో ఉన్న మూఢనమ్మకాలు, చేతబడి లాంటి వ్యవహారాలపై ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ దండు విజువల్ థ్రిల్లర్ గా రూపొందించారు.

PREV
16
తనని కాపాడిన వ్యక్తి కోసం సాయి ధరమ్ తేజ్ ఏం చేశాడో తెలుసా.. డబ్బుతో వెలకట్టలేక..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. 90 దశకం వరకు పలు గ్రామాల్లో ఉన్న మూఢనమ్మకాలు, చేతబడి లాంటి వ్యవహారాలపై ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ దండు విజువల్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఏప్రిల్ 21న  అంటే మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

26

తేజు సరసన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటించింది. ప్రస్తుతం వీరిద్దరూ విరూపాక్ష చిత్రానికి జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తేజు బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత వస్తున్న తొలి చిత్రం ఇది. దీనితో తేజు చాలా ఎమోషనల్ అవుతున్నాడు. విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తేజు చాలా ఎమోషనల్ గా ప్రసంగించిన సంగతి తెలిసిందే. 

 

36

తాజాగా ఇంటర్వ్యూలో తేజు తాను బైక్ ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే స్పందించి సకాలంలో తాను ఆసుపత్రిలో చేరేలా సహాయపడ్డ వ్యక్తిని గుర్తు చేసుకున్నాడు. అతడి పేరు సయ్యద్ అబ్దుల్. తాను పూర్తిగా కోలుకున్న తర్వాత సయ్యద్ ని గుర్తించి కలిసినట్లు తేజు తెలిపాడు. 

46

ప్రాణాలు నిలబడాలంటే గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి చేరడం కీలకం. ఆ సమయంలోనే వైద్యులు ఆరోగ్య స్థితిని కంట్రోల్ లోకి తీసుకురాగలరు. ఆలస్యం జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అబ్దుల్ చేసిన సహాయాన్ని ఈ జీవితంలో మరచిపోలేను. 

56

కేవలం డబ్బు ఇచ్చో.. థ్యాంక్స్ చెప్పో అతడు చేసిన సహాయానికి ఋణం తీర్చుకోలేను. అందుకే అతడిని ఫోన్ నంబర్ ఇచ్చి.. ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరం అయినా వెనుకాడకుండా ఫోన్ చేయమని చెప్పా. అయితే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అతడికి డబ్బు ఇచ్చారేమో నాకు తెలియదు అని తేజు తెలిపాడు. 

66

2021 సెప్టెంబర్ 10న సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ తేజు ఈ ప్రమాదానికి గురయ్యారు. కోలుకున్న తర్వాత తేజు తిరిగి అదే ఎనెర్జీతో సినిమాలు చేస్తుండడం మెగా ఫ్యాన్స్ కి సంతోషాన్నిచ్చే అంశం. 

click me!

Recommended Stories