దేవుడమ్మ రాధను చూడకుండా భాగ్యమ్మ కారులో అక్కడి నుంచి తీసుకువెళ్తుంది.. ఇక మరో సీన్ లో పిల్లలను రాధ ఇంటికి తీసుకురాగా మాధవ సర్ప్రైజ్ ఉందని చెప్తాడు. ఏంటి అని అడగగా దేవి గీసిన బొమ్మను చూపిస్తూ ఇది నువ్వు ఇచ్చావ్ అని అంటాడు. అప్పుడే రాధ కలుగజేసుకొని నీకోసం నేను గిఫ్ట్ తెచ్చానని ఆదిత్య, దేవి కలిసి ఉన్న ఫోటోను చూపిస్తుంది.