యావత్ దేశం సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జక్కన్న రాజమౌళి తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు చేస్తూ సినిమాకి హైప్ మరింత పెంచుతున్నారు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయిపోయింది. అంటే ఇక వారం రోజులోనే ఆర్ఆర్ఆర్ థియేటర్స్ లో సందడి చేయనుంది. తాజాగా రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య ఆఫ్ ది రికార్డులో సరదాగా ఓ ఇంటర్వ్యూ జరిగింది.