Golden Globe Awards: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రేసులో ఆర్ ఆర్ ఆర్ మూవీ... మరింత బలపడుతున్న ఆస్కార్ ఆశలు!

First Published Dec 12, 2022, 8:12 PM IST


ప్రపంచ సినిమా వేదికపై ఆర్ ఆర్ మూవీ సత్తా చాటుతుంది. పలు అంతర్జాతీయ అవార్డ్స్ ఆర్ ఆర్ ఆర్ కైవసం చేసుకుంటుంది. ఆర్ ఆర్ ఆర్ జైత్రయాత్ర కొనసాగుతుంది. మరో అరుదైన గౌరవం దక్కించుకునే దిశగా ఆర్ ఆర్ ఆర్ మూవీ అడుగులు వేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2022 కి నామినేట్ అయ్యింది. 
 

Golden Globe Awards

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నాన్ ఇంగ్లీష్ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ నామినేషన్స్ లో నిలిచింది. ఈ భాగంలో 'ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్'(జర్మనీ), అర్జెంటీనా 1985(అర్జెంటీనా), క్లోజ్(ఫ్రాన్స్, బెల్జియం, నెథర్లాండ్స్), డెసిషన్ టు లీవ్(సౌత్ కొరియా) చిత్రాలతో ఆర్ ఆర్ ఆర్ పోటీపడనుండి.అలాగే ఒరిజినల్ సాంగ్ విభాగంలో... 'నాటు నాటు' నామినేట్ అయ్యింది ఆస్కార్ కి సమానమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆర్ ఆర్ ఆర్ కి దక్కితే రాజమౌళి ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది.

Golden Globe Awards


1944 జనవరి 20న హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్(HFPA) ఆధ్వర్యంలో ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్(Golden Globe Awards) ఇవ్వడం ప్రారంభించారు. 78 ఏళ్లుగా ప్రతి ఏడాది జనవరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రాలకు, నటులకు, సాంకేతిక నిపుణులకు అందిస్తారు. జనవరి 1 నుండి డిసెంబర్ 31వరకు విడుదలైన చిత్రాలు పరిగణలోకి తీసుకుంటారు. 2022 సంవత్సరానికి గానూ ఆర్ ఆర్ ఆర్ నామినేషన్స్ దక్కించుకుంది. 
 


ఈ నేపథ్యంలో గ్లోబల్ సినిమా వేదికలపై సత్తా చాటుతున్న ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అందుకోవడం ఖాయమే అని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియా నుండి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ నామినేషన్స్ కి ప్రవేశం లభించలేదు. దీంతో జనరల్ విభాగంలో 15 కేటగిరీల్లో ఆస్కార్ నామినేషన్స్ కొరకు ఆర్ ఆర్ ఆర్(RRR Movie) చిత్రాన్ని పంపారు. 


1920 నేపథ్యంలో రివల్యూషనరీ యాక్షన్ డ్రామాగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ $ 14 మిలియన్ వసూళ్లు సాధించింది. జపాన్ లో విడుదల చేయగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది. 

RRR Movie

ఆర్ ఆర్ ఆర్ మూవీలో  రామ్ చరణ్-ఎన్టీఆర్(NTR) హీరోలుగా నటించారు. డివివి దానయ్య  నిర్మాతగా ఉన్నారు. కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవగణ్ కీలక రోల్ చేశారు. 
 

click me!