`బాహుబలి`(Bahubali2) తర్వాత దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) రూపొందించిన మరో భారీ సినిమా `ఆర్‌ఆర్‌ఆర్`(RRR). `బాహుబలి`ని మించేలా ఉంటుందనే టాక్‌తో వచ్చిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో వెయ్యికిపైగా థియేటర్లలో విడుదలైంది. అత్యధిక టికెట్ రేట్లతో విడుదలైన `ఆర్‌ఆర్‌ఆర్` బాక్సాఫీస్ షేక్ చేయబోతుందని బుకింగ్స్ ని బట్టే అర్థమైంది. ఊహించినట్టే ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram Charan) హీరోలుగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` వరల్డ్ వైడ్‌గా ఇండియన్ సినిమా రికార్డ్ లను తిరగరాసింది. తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అన్ని ఏరియాల్లోనూ పాత రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచింది. ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్` ఫస్ట్ డే కలెక్షన్లు ఆల్‌టైమ్ రికార్డ్ లను క్రియేట్ చేయడం విశేషం. అన్ని ఏరియాల్లోనూ ఇదే టాక్ రావడం విశేషం. RRR Firstday Collections.
తాజాగా `ఆర్‌ఆర్‌ఆర్` వరల్డ్ వైడ్ కలెక్షన్లని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా శుక్రవారం(ఫస్ట్ డే) ఏకంగా రూ.223కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించింది. అయితే ఆయన ప్రకటించిన వాటి ప్రకారం అన్ని ఏరియాల్లోనూ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలవడం విశేషం. ఏపీలో అత్యధికంగా రూ.75కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇది ఆల్‌టైమ్ రికార్డ్.
మరోవైపు నైజాం(తెలంగాణ)లో ఈ సినిమా 27.5 కోట్ల కలెక్షన్లని రాబట్టింది. ఇది కూడా ఆల్‌టైమ్ రికార్డ్. ఆ తర్వాత బాలీవుడ్‌లో భారీ కలెక్షన్లని రాబట్టింది. కేవలం బాలీవుడ్‌లో సుమారు 18కోట్లు కలెక్ట్ చేయగా, నార్త్ మొత్తం రూ.25కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. తెలుగు సినిమా హిందీలో ఈ స్థాయిలో కలెక్షన్లని రాబట్టడం కూడా ఫస్ట్ టైమ్ అని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బాలీవుడ్ చిత్రాలకు సమానంగా ఓపెనింగ్స్ ని రాబట్టిందని చెప్పొచ్చు.
మరోవైపు కర్నాటకలో 15కోట్లు, తమిళనాట రూ.10కోట్లు, కేరళాలో నాలుగు కోట్లు వసూలు చేయగా, ఇండియా మొత్తం రూ156కోట్లు కలెక్ట్ చేసింది రికార్డ్ సృష్టించింది. ఇక అమెరికాలో `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా సంచలనాలు సృష్టించింది. బుకింగ్స్, ప్రీమియర్స్ తో కలిపి ఈ సినిమా ఏకంగా రూ.42కోట్లు వసూలు చేసింది. ఇది కూడా ఆల్‌టైమ్ రికార్డ్ కావడం విశేషం. అమెరికా కాకుండా ఇతర దేశాలన్నీ కలుపుకుంటే 25కోట్లు వచ్చాయి. ఓ రకంగా ఓవర్సీస్ మొత్తం ఈ సినిమా 67కోట్లు కలెక్ట్ చేయడమనేది కూడా ఆల్ టైమ్ రికార్డ్ గా చెప్పొచ్చు.
ఇలా `ఆర్‌ఆర్‌ఆర్` ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 223కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసి సరికొత్త సంచలనాలకు తెరలేపింది. అయితే ఈ సినిమాకి ఓ వైపు బాక్సాఫీసు టాక్‌తోపాటు డివైడ్ టాక్ కూడా వినిపించింది. స్లోగా ఉందని, నిడివి, ఎమోషన్స్ పండలేదనే విమర్శలు వచ్చాయి. కానీ కలెక్షన్లపై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. పైగా ఊహించని విధంగా ఓపెనింగ్స్ రావడం విశేషం.
అయితే ఫస్ట్ డే అన్నప్పుడు 90శాతం అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయి. కాబట్టి సినిమా టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తుంటాయి. `ఆర్‌ఆర్‌ఆర్` విషయంలో అదే జరిగింది. ఆదివారం వరకు కలెక్షన్లు భారీగానే ఉంటాయి. సోమవారం నుంచి అసలైన పరీక్ష ఎదురవుతుంది. ఆ టైమ్‌లో కలెక్షన్లు సాధించిన చిత్రం సక్సెస్ జాబితాలో చేరిపోతుంది. మరి ఈ చిత్రం ఓవరాల్‌గా `బాహుబలి 2` కలెక్షన్లని అధిగమిస్తుందా అనేది చూడాలి. `బాహుబలి 2` ఏకంగా 1800కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిదే.