పట్టుచీరలో వెలిగిపోతున్న రీతూ వర్మ.. తెలుగు బ్యూటీ అందంగా నవ్వితే కుర్ర గుండెలు గల్లంతే..

First Published | Oct 17, 2023, 8:30 PM IST

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma)  ప్రస్తుతం కోలీవుడ్ లో సందడి చేస్తోంది. వరుస చిత్రాలతో అలరిస్తోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ  ‘మార్క్ ఆంటోనీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రిజల్ట్ ను అందుకుంది.
 

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma)  ప్రస్తుతం కోలీవుడ్ లో సందడి చేస్తోంది. వరుస చిత్రాలతో అలరిస్తోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ  ‘మార్క్ ఆంటోనీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రిజల్ట్ ను అందుకుంది.
 

తమిళంలో వరుసగా ఆఫర్లు అందుకుంటూ వస్తోంది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. క్రేజీ పోస్టులతో ఖుషి చేస్తోంది. 
 


మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మరింత అందాన్ని సొంతం చేసుకుంటూ అట్రాక్ట్ చేస్తోందీ తెలుగు బ్యూటీ. ఈక్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలు ఆకర్షణీయంగా ఉన్నాయి. 
 

బంగారు రంగు పట్టుచీరలో రీతూ వర్మ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టుతో పాటు మ్యాచింగ్ జ్యూయెల్లరీ ధరించి మహారాణిలా మెరిసింది. అలాగే కొప్పులో మల్లెపూలు పెట్టుకొని ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చింది. 

ఆ ఫొటోలను అభిమానులతో పంచుకోవడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో రీతూ వర్మ చాలా అందంగా ఉంటుందంటూ అభిమానులు ఆకాశానికి ఎత్తుతున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ బ్యూటీ ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంటుంది.

ఇక ‘బాద్షా’ చిత్రంతో రీతూ వర్మ వెండితెరపై మెరిసింది. కాజల్ కు చెల్లిలిగా పింకీ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత నుంచి తెలుగు హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ టాలీవుడ్ లో సినిమా అవకాశఆలు అందుకుంది. అటు తమిళంలో నూ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ వస్తోంది. 

తెలుగులో రీతూ వర్మ ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’, ‘కేశవ’ వంటి చిత్రాలతో అలరించింది. పెళ్లి చూపులు మూవీతో మంచి క్రేజ్ దక్కించుకుంది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాతే తమిళంలోనూ వరుస చిత్రాలు చేస్తోంది. 
 

తమిళంలోనూ స్టార్స్ సరసన నటిస్తూ మెప్పిస్తోంది. రీసెంట్ గా ‘మార్క్ ఆంటోనీ’లో విశాల్ సరనస నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. నెక్ట్స్ చియాన్ విక్రమ్ నటించి ‘ధృవ నక్షత్రం’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఆరేళ్ల తర్వాత రిలీజ్ కు సిద్ధమవ్వడం విశేషం.  

Latest Videos

click me!