బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రీతూ చౌదరి బుల్లితెరపై క్రేజ్ ఉన్న సెలెబ్రిటీ. అయితే ఆమె ఆస్తుల గురించి మాత్రం అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.
రీతూ చౌదరి టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న సెలెబ్రిటీ. సోషల్ మీడియాలో ఆమెని మిలియన్ల కొద్దీ నెటిజన్లు ఫాలో అవుతున్నారు. బుల్లితెర షోలు, యాంకరింగ్ చేస్తూ రీతూ చౌదరి పాపులారిటీ సొంతం చేసుకుంది. రీతూ చౌదరి వివాదాలతో కూడా వార్తల్లో నిలిచింది. శ్రీకాంత్ అనే వ్యక్తితో రీతూ చౌదరికి గతంలో వివాహం జరిగినట్లు ప్రచారం ఉంది. కానీ అతడితో కొన్ని నెలలు తాను రిలేషన్ షిప్ లో మాత్రామే ఉన్నానని, పెళ్లి కాలేదని రీతూ చౌదరి గతంలో తెలిపింది.
25
చీమకుర్తి శ్రీకాంత్ తో రిలేషన్, బ్రేకప్
శ్రీకాంత్ అనే వ్యక్తి వివాదాల్లో నిలిచినప్పుడు రీతూ చౌదరి ఆస్తుల గురించి చర్చ జరిగింది. వివాదాల కారణంగా రీతూ, శ్రీకాంత్ విడిపోయారు. చీమకుర్తి శ్రీకాంత్ దాదాపు 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు రీతూ చౌదరి పేరు కూడా వినిపించింది. అతడితో తాను విడిపోయానని, శ్రీకాంత్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని రీతూ పేర్కొంది.
35
అపార్ట్మెంట్ కొనేందుకు సాయం
అయితే రీతూ చౌదరికి ఆస్తులు, లగ్జరీ కార్లు ఎలా వచ్చాయి ? కేవలం టీవీ షోలు చేసే రీతూ చౌదరికి అంత సంపాదన ఎలా సాధ్యం అయింది అంటూ చాలా కామెంట్స్ వినిపించాయి. దీనికి రీతూ చౌదరి ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. తనకున్న అపార్ట్మెంట్ ని కొనే సమయంలో శ్రీకాంత్ తో రిలేషన్ లో ఉన్నాను. ఆ అపార్ట్మెంట్ కి అయిన ఖర్చులో 20 శాతం శ్రీకాంత్ ఇచ్చాడు.
మిగిలిన దాంట్లో కొంత లోన్ ఉంది. కొంత డబ్బు మా నాన్న చనిపోయినప్పుడు వచ్చిన ఇన్సూరెన్స్ నుంచి కట్టాను అని రీతూ పేర్కొంది. నాన్న ఉన్నప్పుడే అమ్మతో మనకు ఒక 7 సీటర్ కారు ఉంటే బావుంటుంది అని అనేవారు. కానీ నాన్న సడెన్ గా చనిపోయారు.
55
నాన్న ఇన్సూరెన్స్ డబ్బుతో లగ్జరీ కారు
ఆయనకున్న ఇన్సూరెన్స్ ద్వారా కొంత డబ్బు వచ్చింది. ఆయా డబ్బులో కొంత మొత్తం అపార్ట్మెంట్ కొనడానికి, మరికొంత బిజినెస్ కోసం వెచ్చించాను. మిగిలిన డబ్బుతో కారు కొన్నాను. నాన్న చనిపోయిన బాధని అమ్మకి కాస్తైనా తగ్గించడానికే అలా చేశాను అని రీతూ చౌదరి పేర్కొంది. రీతూ చౌదరి ఇటీవల చిన్న పాత్రల్లో సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో రీతూ చౌదరి కంటెస్టెంట్ గా పాల్గొంది.