కాంతార ప్రీక్వెల్ లో ప్రాచీన యుద్ధ కళ, ప్రయోగంలో రిషబ్ శెట్టి సక్సెస్ అవుతారా..?

Published : Dec 19, 2024, 11:20 PM IST

ఇండస్ట్రీని షేక్ చేసింది కాంతార సినిమా.. ఈసినిమాకుప్రీక్వెల్ కూడా రాబోతోంది. మరి ఈసినిమా షూటింగ్ ఎక్కడివరకూ వచ్చింది. ఇక ఈమూవీ ద్వారా రిషబ్ శెట్టి ఎటువంటి ప్రయోగం చేయబోతున్నాడు..? 

PREV
15
కాంతార ప్రీక్వెల్ లో ప్రాచీన యుద్ధ కళ, ప్రయోగంలో రిషబ్ శెట్టి సక్సెస్ అవుతారా..?
Rishab Shetty

కాంతార ప్రీక్వెల్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతున్నాడు రిషబ్ శెట్టి. కాని ఈసినిమా రావడానికి చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. ఎందుకుంటే ఈసారి గట్టిగా కొట్టేయాలని చూస్తున్నాడు రిషబ్. తెలుగులో హనుమాన్ పాత్ర చేస్తూనే.. అటు కాంతార ప్రీక్వెల్ కు సబంధించిన షూట్ తో పాటు రీసెర్చ్ కూడా జరుగుతుంది. 

25
Rishab Shetty

ప్రస్తుతం కన్నడ సినిమాలో స్టార్ గా వెలుగు వెలుగున్నారు రిషబ్ శెట్టి.  కాంతార సినిమా లో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి ఇప్పుడు కన్నడ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాడు. . అంతే కాదు   జాతీయ స్థాయిలో ప్రశంసలు కూడా అందుకున్నారు. 

35

ఇక తాను నటించి దర్శకత్వం వహించిన కాంతార  సినిమాలో ఓ అంతరించిపోతున్న జాతి గురించి  కళ్లకు కట్టినట్టు చూపించిన రిషబ్‌ శెట్టి,  కాంతార ప్రీక్వెల్  సినిమాలో ఈ జాతికి సబంధించిన మొత్తం ఇన్ ఫార్మేషన్ ను అందించబోతున్నాడు. ఇక ఈసినిమా ద్వారా ఓ  సరికొత్త ఫైట్‌ ఆర్ట్‌ చూపించనున్నాడు రిషబ్ శెట్టి. . అవును, చాలా మందికి తెలిసినట్లుగా, రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాలో కలరిపయట్టు యుద్ధ కళను చూపిస్తాడని అంటున్నారు. 
 

45

ఇంతకీ కలరిపయట్టు అంటే ఏమిటి? 'ది మార్షల్ ఆర్ట్ ఆఫ్ కలరిపయట్టు శతాబ్దాలుగా కేరళలో పాతుకుపోయిన ఒక ప్రత్యేకమైన శారీరక అభ్యాసం'. ఇది అంతరించిపోతున్న వ్యాయామ కళ.  ఆర్య,ద్రావిడ జాతి ఉపయోగించిన  అతి పురాతనమైనది.

ఒకప్పుడు ఈ కళ బాగా ప్రాచుర్యంలో ఉండేదట. రాజులు ప్రత్యేకంగా దీన్ని పెంచి పోషించారని సమాచారం. నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి కాంతారావుకు ప్రీక్వెల్ సినిమాలో ఈ  కలరిపయట్టును చూపించబోతున్నాడు.

దీనికి సబంధించిన కలరిపయట్టు ఫైట్‌ను రిషబ్ శెట్టి ఇప్పటికే కేరళలోని ఓ ఎక్స్‌పర్ట్ దగ్గర నేర్చుకున్నాడని అంటున్నారు. ఎంతో కష్టమైనా ఈ కళను.. ఆయన చాలా ఇష్టంగా నేర్చుకన్నాడట. 

55
Rishab Shetty starrer Kantara film 2 release announcements out

కలరిపయట్టు ఫైట్ ను నేర్చుకునే విధానాన్ని రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాంతారావు ప్రీక్వెల్ ఇప్పటికే చాలా వరకూ  షూటింగ్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గా ఈసినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు రిషబ్. మరి అంత టైమ్ తీసుకున్నాడు అంటే అందులో ఏం చూపించబోతున్నాడు అనేది చూడాలి. 
 

click me!

Recommended Stories