చిత్ర పరిశ్రమలో ఏ స్టార్ హీరోని తీసుకున్నా వారి ఆస్తుల విలువ వందల కోట్లల్లో ఉంటుంది. సినిమాలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలు చేసి కూడా కొందరు హీరోలు బాగా సంపాదిస్తుంటారు. నాగార్జున, రాంచరణ్ లాంటి హీరోలకు సినిమాలు కాకుండా ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. సౌత్ లో ఈ ఏడాది మరింతగా ఆదాయం పెంచుకుని ధనవంతులుగా నిలిచిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం.
నాగార్జున : కింగ్ నాగార్జున నికర ఆస్తుల విలువ 2023లో 3000 కోట్ల పైనే. సౌత్ లో నాగార్జునే అత్యంత ధనవంతుడైన నటుడు. అనేక వ్యాపారాల్లో కింగ్ నాగార్జున భాగస్వామిగా ఉన్నారు.
210
చిరంజీవి : మెగాస్టార్ చిరంజీవి నెట్ వర్త్ విలువ 1500 కోట్ల వరకు ఉంది. నాగార్జున తర్వాత చిరునే సౌత్ లో ధనవంతుడైన నటుడు.
310
రాంచరణ్: మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాన్ ఇండియా నటుడిగా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుల్లో ఒకరు. అనేక బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూనే చరణ్ పలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. చరణ్ నికర ఆస్తుల విలువ 1300 కోట్లు.
410
కమల్ హాసన్ : లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ ఏడాది బాగానే ఆర్జించారు. కమల్ హాసన్ నెట్ వర్త్ 700 కోట్లు.
510
జూ.ఎన్టీఆర్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. కార్పొరేట్ సంస్థలకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు. ఎన్టీఆర్ నెట్ వర్త్ 570 కోట్లు.
610
రజనీకాంత్ : ఇండియన్ సినిమాకే సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ నికర ఆస్తుల విలువ 430 కోట్లు. ఈ ఏడాది రజనీకాంత్ జైలర్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు.
710
దళపతి విజయ్ : తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న దళపతి విజయ్ నెట్ వర్త్ 400 కోట్లు అని తెలుస్తోంది.
810
అల్లు అర్జున్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో టాప్ ఫామ్ లో ఉన్నారు. అల్లు అర్జున్ కి సినిమాల నుంచి కాకుండా వ్యాపారాల నుంచి కూడా ఆదాయం ఉంది. బన్నీ నెట్ వర్త్ 370 కోట్లు.
910
మహేష్ బాబు : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు కార్పొరేట్ సంస్థల బ్రాండింగ్ లో కూడా బిజీగా ఉంటారు. మహేష్ నికర ఆస్తుల విలువ 250 కోట్లు.
1010
ప్రభాస్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మార్కెట్ ని ఊపేస్తున్న హీరో. ప్రభాస్ నెట్ వర్త్ 230 కోట్లు.