ఈక్రమంలోనే శ్రీదేవి కెరీర్ లో మంచి పేరు తెచ్చిన సినిమాలు.. ఆమెను నిలబెట్టిన టాలీవుడ్ సినిమాల గురించి హోస్ట్ సుమ శ్రీదేవిని ప్రశ్నించారు. ఈ విషయంలో సమాధానం చెప్పిన శ్రీదేవి తన కెరీర్ లో అద్భుతం చేసిన సినిమాలు దర్శకుల గురించి చెపుతూ.. చివరిగా వర్మపేరు చెప్పారు. అంతే కాదు క్షణం క్షణం సినిమా కూడా తన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ అని అన్నారు.
దాంతో అలిగిన ఆర్జీవి... ఏదో కంటితుడుపుగా అంటున్నారు. కుక్కు బిస్కెట్ వేసినట్టు.. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి.. కావాలని అలా అంటున్నారు అని అన్నారు. దానికి శ్రీదేవి తో పాటు... అక్కడే ఉన్న రాఘవేంద్రరావు కూడా సమాధానం చెపుతూ.. అదేం లేదు. ఆసినిమా ఎంత హిట్ అయ్యింది. అప్పట్లో ఎంత అద్భుతం క్రియేట్ చేసింది అనే విషయం అందిరిక తెలుసు అన్నారు.
దాంతో అంతా నవ్వుకున్నారు. ఈరకంగా శ్రీదేవిని నాకు కుక్క బిస్కెట్స్ వేస్తున్నారు అని ఆర్జీవి సరదాగా అన్నారు. రామ్ గోపాల్ వర్మకు హీరోయిన్ శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.