Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? అసలు విషయం వెల్లడించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య

Published : Jun 18, 2026, 04:44 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడాకుల తరువాత అన్నా లెజినోవాను పెళ్లాడారు. కానీ రేణు దేశాయ్ ఎందుకు రెండో పెళ్లి చేసకోలేదో తెలుసా? అసలు కారణం ఏంటి? రేణు ఈ విషయంలో ఏం చెప్పిందంటే?

PREV
14
రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు?

పవన్ కళ్యాణ్ తో ప్రేమ, పెళ్లి విడాకుల తరువాత రేణు దేశాయ్ ఎందుకు రెండో పెళ్లి చేసకోలేదు. పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాను పెళ్లాడారు కానీ రేణు మాత్రం సింగిల్ గా మిగిలిపోవడానికి కారణం ఏంటి? గతంలో రేణు పెళ్లిపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.. కాని అవి పెళ్లి పీటల వరకూ వెళ్లకపోవడానికి రీజన్ ఏంటి? ఈ విషయంలో రేణు దేశాయ్ ఒ ఇంటర్వ్యలో క్లారిటీ ఇచ్చారు. అసలే నిజాలు ఆమె వెల్లడించింది. ఇంతకీ రేణు ఏమన్నది.

24
రెండో పెళ్లిపై రేణు దేశాయ్ కామెంట్స్..

గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది రేణు. పవన్ కళ్యాణ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు మీరెందుకు చేసుకోలేకపోతున్నారు అని ఆమెకు ప్రశ్న ఎదురయ్యింది. అప్పుడు ఆమె మాట్లాదుతూ..'' రెండో పెళ్లి చేసకోవాలి అంటే అంత ఈజీ కాదు.. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. వారిని తన పిల్లలుగా యాక్సప్ట్ చేసే అతను కావాలి. అలాంటి వ్యక్తులు చాలా రేర్ గా ఉంటారు. అలా ఒప్పుకోవాలి అంటే కూడా చాలా పెద్ద మనసు కావాలి. ఈ కాలంలో ఎవరు ఉంటారు అంత ఆలోచించేవారు. పైగా ఇండస్ట్రీ అమ్మాయిలు అంటే వేరే ఆలోనతో ఉంటారు. నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే.. రేణు దేశాయ్ ను పెళ్లాడుతున్న అనుకోరు.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యను పెళ్లి చేసుకుంటున్న అన్న ఫీలింగ్ ఉంటుంది. అది నాకు ఇష్టం ఉండదు. పైగా నాకు పెళ్లి ఎందుకు అని చాలామంది సలహాలు ఇచ్చారు.. ఇద్దరు పిల్లలు ఉన్నారు హ్యాపీగా వారిని పెంచుకుంటూ ఉండకుండా రెండో పెళ్లి ఎందుకు అని నాకు సలహాలు ఇచ్చారు'' అంటూ రేణు దేశాయ్ అన్నారు.

34
విడాకుల తరువాత కూడా సింగిల్ గానే..

రేణు దేశామ్ సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతుంటారు. చాలా విషయాలపై రేణుదేశాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. గతంలో హెచ్ సీయు భూముల విషయంలో ఘాటుగా పోస్ట్ పెట్టిన ఆమె.. వీధికుక్కుల విషయంలో పోరాటం చేసింది. రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని 12 ఏళ్లకు పైనే అవుతోంది. వన్ కళ్యాణ్ రేణుతో డివోర్స్ తరువాత రష్యన్ నటి అన్నలెజినోవాను పెళ్లాడారు. కాని రేణు దేశాయ్ మాత్రం సింగల్ గానే ఉంది. పిల్లల బాధ్యత తీసుకుని.. వారిద్దరిని పెంచి పెద్ద చేసింది. ఇక డివోర్స్ తరువాత కూడా పిల్లల కోసం ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉన్నారు.

44
అకీరా ఎంట్రీపై రేణు కామెంట్స్..

అకీరా ఎంట్రీపై కూడా రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. అకిరా నందన్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, రామ్ చరణ్ ఆ సినిమాను నిర్మిస్తారు అని వస్తున్న వార్తలపై రేణు దేశాయ్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘అకిరా ఇంకా సినిమాల్లోకి రావాలా వద్దా అనేది నిర్ణయించుకోలేరు. సోషల్ మీడియా లో ప్రచారమైన వార్తలన్నీ అబద్దాలే. అకిరా సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు నేనే అందరికీ తెలిసేలా అనౌన్స్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.

Read more Photos on
click me!

Recommended Stories